Share News

Myalgic symptoms : డిప్రెషన్ నుంచి ఉబ్బరం వరకూ అన్నీ ఈ వ్యాధి లక్షణాలే..

ABN , Publish Date - May 18 , 2024 | 10:06 AM

మైయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిక్ (ME) లేదా (SEID) అని పిలుస్తారు. ఈ సమస్యకు సరైన కారణాలు ఇంకా తెలియవు కానీ.. వైరల్ ఇన్ఫెక్షన్, మానసిక ఒత్తిడి వల్ల ఇవి వచ్చే అవకాశం ఉంది. 40 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్లో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గడం, నాడీ, ఎండోక్రైన్ వ్యవస్థలతో సహా శరీరంలో అనేక భాగాలను ఇది ప్రభావితం చేస్తుంది.

Myalgic symptoms : డిప్రెషన్ నుంచి ఉబ్బరం వరకూ అన్నీ ఈ వ్యాధి లక్షణాలే..
Myalgic symptoms

Myalgic Encephalomyelitis symptoms:చిన్న పని చేసినా తెగ అలిసిపోయినట్టు అనిపిస్తుంది. ఓ వయసు దాటాకా ఇది మరీ ఎక్కువగా అనిపిస్తుంది. అయితే రకరకాల కారణాలతో ఈ సమస్యను పెద్దగా పట్టించుకోం. దీనిని మైయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిక్ (ME) లేదా (SEID) అని పిలుస్తారు. ఈ సమస్యకు సరైన కారణాలు ఇంకా తెలియవు కానీ.. వైరల్ ఇన్ఫెక్షన్, మానసిక ఒత్తిడి వల్ల ఇవి వచ్చే అవకాశం ఉంది. 40 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్లో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గడం, నాడీ, ఎండోక్రైన్ వ్యవస్థలతో సహా శరీరంలో అనేక భాగాలను ఇది ప్రభావితం చేస్తుంది.

1. క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ (CFS) తీవ్రతను తెలిపే 5 సంకేతాలు, లక్షణాలు..

2. జ్ఞాపకశక్తి ఇబ్బందులు.. ఏకాగ్రత, విషయాన్ని చేరవేసేప్పుడు ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇది మెదడును ఇబ్బందికి గురిచేస్తుంది. రోజువారి పనులు కష్టం అవుతాయి.

3. శరీరంలో నొప్పి.. కండారాల నొప్పి, కీళ్ల నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ రోగులలో తరచుగా కనిపించే లక్షణం.

Clay Pot Cooking: మట్టి కుండ వంట రుచి, వాసనను పెంచుతుందా? ఎందుకు ఇందులో వంట చేయాలి...!


4. మానసిక అవాంతరాలు.. సిఎఫ్ఎస్ తో బాధపడేవారిలో డిప్రెషన్, ఆందోళన, చిరాకు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇవి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

5. జీర్ణ సమస్యలు.. ఉబ్బరం, వికారం, పొత్తికడుపు నొప్పి, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలు మొదలవుతాయి.

ఎక్సర్షన్ల్ మలైజ్..PEM ఇది CFS ముఖ్య లక్షణం. శరీరక, మానసిక శ్రమ వలన లక్షణాలు మరింత తీవ్రంగా మారతాయి. అలసట మాత్రమే కాదు. నొప్పి, విషయాలను గుర్తు ఉంచుకోవడంలో మతిమరుపు ఉంటాయి. ఇది వారాలు, లేదా నెలల పాటు ఉంటుంది. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 18 , 2024 | 10:06 AM