Share News

weight loss నెమ్మదిగా బరువు తగ్గాలంటే ఎలా..!

ABN , Publish Date - May 18 , 2024 | 01:48 PM

వారానికి కనీసం 150 నుంచి300 నిమిషాలు తీవ్రమైన వ్యాయామం అవసరం. 75 నుంచి 150 నిమిషాల తీవ్రమైన వ్యాయామం లక్ష్యంగా పెట్టుకోవాలి. దీనితో మంచి ఫలితం ఉంటుంది.

weight loss నెమ్మదిగా బరువు తగ్గాలంటే ఎలా..!
weight loss

బరువు తగ్గాలంటే చాలా చిట్కాలను ఫాలో అవుతుంటాం. రకరకాల డైట్స్ ఫాలో అవుతాం. అయితే ఏది ఆరోగ్యకరమైనది. ఏ డైట్ ఫాలో అయితే బరువు ఈజీగా తగ్గుతారనేది ఎవరికీ సరిగ్గా తెలీని విషయం. ఇప్పటి రోజుల్లో డైట్ విషయంలో చాలా రకాలు మార్కెట్లోకి వచ్చాయి. బరువు సమస్యను ఇది ఫాలో అయితే చాలా తగ్గిపోవచ్చనే ప్రచారాలూ ఎక్కువగానే సాగుతున్నాయి. అలాగే ఓ డైట్ అనుకున్నాకా దానిని సరిగా ఫాలో కాకుండా మధ్యలో గ్యాప్స్ ఇవ్వడం, ఉపవాసాలు చేయడం వల్ల బరువు విషయంలో శరీరం గందరగోళానికి గురవుతుంది. బరువును తగ్గేందుకు ఉన్న మార్గాలేమిటి. నిలకడగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి.

త్వరగా బరువు తగ్గించే డైట్ ప్లాన్స్, సప్లిమెంట్స్, ఇంటెన్స్ వర్కవుట్లు, ఇవన్నీ బరువు తగ్గిస్తాయా..వేగంగా బరువు తగ్గాలనుకుని పాటించే చాలా విధానాలు శరీరాన్ని అయోమయంలో పడేస్తాయి. ఆరోగ్యకరమైన, దీర్ఘకాలిక చిక్కుల్లో పడేస్తాయి. అందుకో కంగారు లేని పద్దతుల ద్వారా బరువు తగ్గడం మంచిది.

కేలరీలు..

కాలిక్యులేటర్ ఉపయోగించి, రోజువారి కేలరీలను లెక్కగట్టండి. రోజుకు 500 నుంచి 1000 కేలరీల లోటు వచ్చేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల వారానికి 1 నుంచి 2 కేజీలు బరువు తగ్గడానికి వీలుంటుంది.

ప్రోటీన్ తీసుకోవడం వల్ల..

చికెన్, చేపలు, గుడ్లు, కాయధ్యాన్యాలు, గ్రీకు పెరుగు, లీన్ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల బరువు తగ్గే సమయంలో కండరాలకు మద్దతుగా ఉంటుంది. ప్రోటీన్ ఇందుకు సాయపడుతుంది.

ప్రాసెస్ చేసిన ఆహారాలు వద్దు..

పండ్లు, కూరలు, ధాన్యాలు వీటితోనే ప్లేట్ నిండిపోవాలి. ఫాస్ట్ ఫుడ్ జోలికి పోకూడదు. స్నాక్స్ వంటివి తినకూడదు. క్యాలరీలు, పోషకాలు లేని ఆహారాను తగ్గించి తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే పోషకాలతో నిండి ఉన్న ఫుడ్స్ బెస్ట్..

రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ..

వారానికి కనీసం 150 నుంచి300 నిమిషాలు తీవ్రమైన వ్యాయామం అవసరం. 75 నుంచి 150 నిమిషాల తీవ్రమైన వ్యాయామం లక్ష్యంగా పెట్టుకోవాలి. దీనితో మంచి ఫలితం ఉంటుంది.


regular exercise : బరువును తగ్గాలంటే వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు.. ఇది ఫాలో అయితే చాలు..!

హైడ్రేట్ గా ఉండాలి..

సరైన నీటిని రోజులో తీసుకుంటూ ఉండాలి.

నిద్ర..

రాత్రి త్వరగా తిని త్వరగా నిద్రపోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం.

మైండ్ ఫుల్ ఆహారం..

ఆకలి ఉన్నంతే తినాలి. టీవి, ఎలక్ట్రానిక్ పరికరాలతో కలిపి భోజనం చేయడం, పరధ్యాన్నంగా తినడం ఇవి తగ్గించుకోవాలి.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 18 , 2024 | 01:49 PM