Share News

Super Food : ఈ మొక్కను గుర్తు పట్టారా..! ఈ సర్కారు తుమ్మతో ఎన్ని లాభాలంటే..!

ABN , Publish Date - May 08 , 2024 | 05:10 PM

ఈ సర్కారు తుమ్మ కాయల పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే కండరాలకు బలం చేకూరుతుంది. అలాగే ఇందులోని ప్రోటీన్ కంటెంట్ శరీర క్రియలకు శక్తిని అందిస్తుంది.

Super Food : ఈ మొక్కను గుర్తు పట్టారా..! ఈ సర్కారు తుమ్మతో ఎన్ని లాభాలంటే..!
Super Food

తుప్పల్లో ఎక్కడ చూసినా ఎక్కువ కనిపించేది సర్కారు తుమ్మ (Mesquite) చెట్టు. దీని చిన్నతనంలో ఆకులతోనూ, పూలతోనూ తెగ ఆడుకుని ఉంటారు. మన దేశంలో ఎక్కువగా మన ప్రాంతాల్లో ఎక్కడైనా కనిపిస్తుంది. ఈ మొక్కకు కాసే పూలు, కాయలలో ఎన్నో ఔషదగుణాలు దాగి ఉన్నాయి. ఈ కాయల్ని పొడిచేసి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయట. ఇందులోని పొటాషియం చాలా అనారోగ్యాలను దూరం చేస్తుంది.

పోషకాలు అధికంగా..

ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్ తో సహా అవసరమైన పోషకాలన్నీ ఇందులో ఉన్నాయి. ఈ పోషకాలు సమతుల్య ఆహారంలో విలువైనదిగా చెప్పవచ్చు. అధిక ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఈ సర్కారు తుమ్మ కాయల పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే కండరాలకు బలం చేకూరుతుంది. అలాగే ఇందులోని ప్రోటీన్ కంటెంట్ శరీర క్రియలకు శక్తిని అందిస్తుంది.

1. మధుమేహం ఉన్నవారు ఈ పొడిని తీసుకోవడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి.


Hearth Health : గుండె నొప్పిని ముందుగానే తెలిపే లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

2. జీర్ణ ఆరోగ్యానికి కూడా సర్కారు తుమ్మ పనిచేస్తుంది. ఇందులోని ఫైబర్ పేగు కదలికలను మెరుగుపరుస్తుంది.

3. పీచు , ప్రీబయోటిక్ గా పనిచేస్తుంది. పేగులలోని ప్రయోజనకరమైన బ్యాక్టిరియాను పెంచుతుంది.


Protein Food : రోజువారి ఆహారంలో ప్రోటీన్ ఫుడ్స్ ఎలా చేర్చుకోవాలి.. !

4. దీనిని తీసుకోవడం వల్ల మలబద్దకం, ఉబ్బరం, అజీర్ణం లక్షణాలు తగ్గుతాయి.

ఎముక ఆరోగ్యానికి కూడా సర్కారు తుమ్మ మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇందులోని ఖనిజాలు ఎముకల సాంద్రతను పెంచుతాయి. బోలు ఎముకల వ్యాధ, పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దీర్ఘకాలిక ఎముకల ఆరోగ్యానికి మంచిది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - May 08 , 2024 | 05:10 PM