Share News

Navya : కుంగుబాటు లక్షణాలివే...

ABN , Publish Date - May 19 , 2024 | 03:46 AM

ఎప్పటికప్పుడు మారుతున్న ఈ ఆధునిక ప్రపంచంలో జీవనం చాల మందికి ఎంతో ఒత్తిడితో, మరెంతో అలసటతో కూడుకున్నది. మనం ఎంతో మామూలుగా భావించి వదిలేసే కొన్ని లక్షణాలు దీర్ఘకాలిక అలసటకు, కుంగుబాటుకు సూచనలు కావచ్చు. అలాంటి కొన్ని లక్షణాలను తెలుసుకుందాం.

Navya : కుంగుబాటు లక్షణాలివే...

ఎప్పటికప్పుడు మారుతున్న ఈ ఆధునిక ప్రపంచంలో జీవనం చాల మందికి ఎంతో ఒత్తిడితో, మరెంతో అలసటతో కూడుకున్నది. మనం ఎంతో మామూలుగా భావించి వదిలేసే కొన్ని లక్షణాలు దీర్ఘకాలిక అలసటకు, కుంగుబాటుకు సూచనలు కావచ్చు. అలాంటి కొన్ని లక్షణాలను తెలుసుకుందాం.

  • ఎల్లప్పుడూ అలసిపోయినట్లుగా, నీరసంగా అనిపించడం. మామూలుగా చేసుకునే పనుల విషయంలో కూడా అయోమ యానికి గురవుతుండటం.

  • రాత్రంతా నిద్ర సరిగా పట్టక పడక మీద అటు ఇటు తిరుగు తూ దొర్లుతూ ఉండటంవల్ల మరుసటి రోజు ఉత్సాహంగా పని చేసుకోలేక పోవడం, అది తీవ్రమైన మానసిక అలసటకు, కుంగుబాటుకు సూచన కావచ్చు.

  • ఎప్పుడో ఓసారి అనారోగ్యం బారిన పడటం అందరికీ మామూలే. పూర్తి ఆరోగ్యవంతుడైన మనిషికి ఏడాదిలో రెండు, మూడుసార్లు మాత్రమే జలుబు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ పదేపదే చిన్న ఆరోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటే మాత్రం అది కుంగుబాటు సూచనగా భావించి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఛాతీలో పట్టేసినట్లు, శ్వాస సరిగా ఆడనట్లు అనిపించడంకూడా కుంగుబాటుకు మరొక సూచనగా చెప్పవచ్చు.


  • సెలవు రోజులల్లోనో లేక ఆదివారమో మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల మరింత విశ్రాంతి లభిస్తుంది. కానీ పదేపదే సమయం సందర్భంలేకుండా కూడా నిద్ర పోవాలని అనిపిస్తే అది కుంగుబాటుకు సూచన కావచ్చు. అంతేకాకుండా...

  • కారణం లేకుండా లేదా చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యులమీద, దగ్గరి వారిపై చిరాకు పడటం

  • పెదవులు ఎండిపోయి, పగిలిపోయి ఉండటం. జుట్టు, చర్మం పొడిబారి కాంతిహీనంగా తయారవటం

  • వ్యాయామంమీద ఆసక్తి తగ్గి పోవటం, ఫాస్ట్‌ ఫుడ్‌మీద ఎక్కువ మక్కువ చూపించటం.

Updated Date - May 19 , 2024 | 03:46 AM