Share News

Skin care : వానాకాలంలో అన్ని రకాల చర్మాలవారు తీసుకోవాల్సిన చర్మ సంరక్షణ చిట్కాలు ఇవే..

ABN , Publish Date - Jul 01 , 2024 | 01:05 PM

భారీ మేకప్ వర్షాకాలంలో ముఖ చర్మం రంధ్రాలను అడ్డుకునేందుకు రోటీన్ మేకప్ ను ఎంచుకోవాలి. పుష్కలంగా నీరు త్రాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లి చర్మం లోపలి నుండి హై డ్రేట్‌గా ఉంచుతుంది.

Skin care : వానాకాలంలో అన్ని రకాల చర్మాలవారు తీసుకోవాల్సిన చర్మ సంరక్షణ చిట్కాలు ఇవే..
Skincare

వర్షాకాలంలో తీవ్రమైన వాతావరణం కారణంగా జిడ్డు చర్మం ఉన్నవారు, మురికి, నూనెలు, కాలుష్యం కారణంగా వారానికి ఒకసారి ఏదో ఒక మాస్క్ వేసుకోవడం అవలవాటు చేసుకోవాలి. వాన చినుకుల కారణంగా చర్మం తాజాగా కనిపించాలంటే ముఖ చర్మానికి తీసుకునే రక్షణ మరింత పెరగాలి. కాలం మార్పుతో వాతావరణంలో కాలుష్యం, ధూళి ముఖ చర్మాన్ని ఇట్టే ప్రభావితం చేస్తుంది. సున్నితమైన సల్ఫైట్ లేని క్లెన్సర్‌తో ముఖాన్ని రోజుకు రెండుసార్లు కడగాలి. జిడ్డుగల చర్మం ఉన్నవారు ఫోమ్ క్లెన్సర్‌ను పొడిగా లేదా సున్నితమైన చర్మం కోసం క్రీమ్ క్లెన్సర్‌ను ఎంచుకోవాలి ఇంకా..

భారీ మేకప్ వర్షాకాలంలో ముఖ చర్మం రంధ్రాలను అడ్డుకునేందుకు రోటీన్ మేకప్ ను ఎంచుకోవాలి. పుష్కలంగా నీరు త్రాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లి చర్మం లోపలి నుండి హై డ్రేట్‌గా ఉంచుతుంది. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని త్రాగడం మంచిది.

1. పొడి చర్మం ఉన్నవారు ముఖాన్ని తక్కువసార్లు శుభ్రం చేసుకోవాలి.

2. మాయిశ్చరైజ్ చేయడంవల్ల వర్షాకాలం ఇది చాలా అవసర పడుతుంది.


Health Tips : మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!

3. సూర్యుడి ప్రతాపం చర్మం మీద తక్కువగా ఉంటుంది. అయినా సరే బయటికి వెళ్ళే సమయాల్లో చర్మానికి సన్ స్క్రీన్ ఉపయోగించాలి.

4. చల్లని టోనర్ చర్మానికి మంచి స్నేహితుడిగా పనిచేస్తుంది. ఇది పిహెచ్ బ్యాలెన్స్‌ను సంరక్షించడంలో సహాయపడుతుంది.

Health Tips : మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకునేందుకు ఈ సూపర్ ఫుడ్స్ ట్రై చేయండి..!

5. వర్షాకాలం చర్మానికి తీవ్రంగా హాని కలిగించే టాక్సిన్స్ కు శక్తివంతమైన ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగడం ద్వారా చర్మ సంరక్షణ చాలా అవసరం.

6. ముఖాన్ని తాజాగా ఉంచాలంటే ఏదో ఒక చర్మనిగారింపును పెంచే ఫేషియల్స్ ముఖానికి పట్టిస్తూ ఉండాలి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచేలా చేస్తుంది. నిగారింపును కూడా ఇస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం ప్రతి వారం ఇలాంటి చికిత్స అవసరం.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 01 , 2024 | 01:05 PM