Symptoms Of Typhoid: టైఫాయిడ్ సంకేతాలు, లక్షణాలు ఎలా ఉంటాయంటే..
ABN , Publish Date - May 27 , 2024 | 04:12 PM
S.Typhi అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ఇది సోకిన వ్యక్తులు ప్రేగులలో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. కలుషిత నీటిని తాగడం వల్ల ఉది వ్యాపిస్తుంది. టైఫాయిడ్ ఉన్నవారు చేతులను కడుక్కోకుండా తినే వస్తువులను తాగినట్లయితే ఇది జరుగుతుంది.
టైఫాయిడ్ జ్వరం తర్వాత శరీరం చాలా వరకూ అన్ని క్రియలకు మొరాయిస్తుంది. టైఫాయిడ్ వచ్చే ముందు శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. అసలు ఇది ఎలా, ఎటువంటి లక్షణాలతో బయటపడుతుంది. టైఫాయిడ్ జ్వరం సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అనారోగ్యం. ఇది చిన్న ప్రేగులకు సోకుతుంది. దీనితో అధిక జ్వరం, కడుపు నొప్పి, ఇతర లక్షణాలు ఉంటాయి. టైఫాయిడ్ ఫీవర్ ని ఎంటరిక్ ఫీవర్ అని కూడా అంటారు.
పారాటైఫాయిడ్ జ్వరం.. ఇది టైఫాయిడ్ మాదిరిగానే ఉన్నా, ఈ లక్షణాలు మాత్రం తేలికగా ఉంటాయి. ఇది సాల్మొనెల్లాపారాటిఫి వల్ల వస్తుంది. దక్షిణ , ఆగ్నేయాసియా , అమెరికా, ఆఫ్రికా, కరేబియన్ దేశాలలో టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇది పెద్దలకంటే పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల నుండి 21 మిలియన్ల మంది ప్రజలు టైఫాయిడ్ బారిన పడుతున్నారని ఓ అంచనా..టైఫాయిడ్ జ్వరం నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా కాలం పాటు ఈ లక్షణాలు శరీరంలో ఉంటూ ఉంటాయి.
టైఫాయిడ్, టైఫస్ మధ్య తేడా..
పేర్లు ఒకే విధంగా ఉన్నా కూడా టైఫాయిడ్, టైఫస్ అనేమి వేర్వేరు బాక్టీరియా వల్ల వచ్చే వివిధ అనారోగ్యాలు, లక్షణాలు కాస్త దగ్గరగా ఉంటాయి. టైఫాయిడ్ జ్వరానికి చికిత్స చేయకుండా వదిలేస్తే అది చాలా వారాల పాటు ఉంటుంది. కొద్ది రోజులలోనే అద్వాన్నంగా మారుతుంది.
Nutritional Deficiency : పోషకాహార లోపాల కారణంగానే బరువు ఇట్టే పెరుగుతారు. ఇలా ఎందుకంటే..!!
టైఫాయిడ్ జ్వరం ఇతర లక్షణాలు..
తలనొప్పి.
చలి
ఆకలి లేకపోవడం
కడుపు నొప్పి
గులాబీ మచ్చలు శరీరం మీద ఛాతీ, కడుపు భాగంలో కనిపిస్తాయి.
దగ్గు
కండరాల నొప్పులు
వికారం, వాంతులు
అతిసారం, మలబద్దకం ఉంటాయి.
ఈ జ్వరానికి కారణాలు..
S.Typhi అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ఇది సోకిన వ్యక్తులు ప్రేగులలో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. కలుషిత నీటిని తాగడం వల్ల ఉది వ్యాపిస్తుంది. టైఫాయిడ్ ఉన్నవారు చేతులను కడుక్కోకుండా తినే వస్తువులను తాగినట్లయితే ఇది జరుగుతుంది. త్రాగే నీటిలో, తినే ఆహారంలో వ్యర్థ నీరు కలుషితం అవడం వల్ల ఇది జరగవచ్చు.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.