Share News

Tips : కళ్లపై ఒత్తిడి... ఇలా తగ్గిద్దాం..!

ABN , Publish Date - Nov 11 , 2024 | 02:14 AM

ఇటీవల కాలంలో పిల్లలు డిజిటల్‌ తెరల నుంచి చూపు తిప్పడంలేదు. దీనివల్ల కళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితి సుదీర్ఘ కాలం కొనసాగితే నిద్రలేమి వంటి సమస్యలెన్నో తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు.

Tips  : కళ్లపై ఒత్తిడి...  ఇలా తగ్గిద్దాం..!

టీవల కాలంలో పిల్లలు డిజిటల్‌ తెరల నుంచి చూపు తిప్పడంలేదు. దీనివల్ల కళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితి సుదీర్ఘ కాలం కొనసాగితే నిద్రలేమి వంటి సమస్యలెన్నో తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు. కళ్లు అలసటకు గురికాకుండా కొన్ని సూచనలు చేస్తున్నారు.

  • డిజిటల్‌ తెరలను వీక్షిస్తున్నప్పుడు ఆ గదిలో మంచి వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అంటే స్ర్కీన్‌ బ్రైట్‌నెస్‌- రూమ్‌ లైటింగ్‌ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకుండా జాగ్రత్తపడాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే... మీ పిల్లలు గాడ్జెట్స్‌ను చీకట్లో ఉపయోగించకుండా చర్యలు తీసుకోండి. అలాగే స్ర్కీన్‌పై వేరే లైట్‌ రిఫ్లెక్షన్లు పడకుండా చూడండి.

  • కంప్యూటర్‌, ట్యాబ్‌, మొబైల్‌... ఏది చూస్తున్నా వాటి స్ర్కీన్‌కి పిల్లల కళ్లకి మధ్య కనీసం ఒకటిన్నర నుంచి రెండు అడుగుల దూరం ఉండాలి. స్ర్కీన్‌ టాప్‌ వారి కళ్లకు సమాంతర ఎత్తులో పెట్టాలి. దీనివల్ల మీ పిల్లలు స్ర్కీన్‌ చూడడానికి తల అటూ ఇటూ తిప్పి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

  • చుట్టుపక్కల పరిసరాలకు తగినట్టుగా స్ర్కీన్‌ బ్రైట్‌నె్‌సను ఎడ్జెస్ట్‌ చేయండి. మరీ డార్క్‌గానో... మరీ లైట్‌గానో ఉండకూడదు. స్పష్టంగా కనిపించడానికి కాంట్రా్‌స్టను సరి చేయండి. దీనివల్ల కళ్లకు శ్రమ తగ్గుతుంది.

  • కంప్యూటర్‌ స్ర్కీన్‌ మీద ఆబ్జెక్ట్స్‌ కానీ, అక్షరాలు కానీ కనిపించీ కనిపించనట్టు ఉండకూడదు. చూడగానే స్పష్టంగా ఉండేలా ఫాంట్‌ సైజ్‌ పెంచుకోండి. అవసరమైతే జూమ్‌ ఆప్షన్‌ని ఉపయోగించండి.

  • డిజిటల్‌ తెరల నుంచి వచ్చే బ్లూ లైట్‌ మీ పిల్లల నిద్రకు భంగం కలిగిస్తుంది. ముఖ్యంగా నిద్రపోయే ముందు గాడ్జెట్స్‌ని ఉపయోగించడంవల్ల ఈ సమస్య మరింత వేధిస్తుంది. సాయంత్రం వేళల్లో మొబైల్స్‌, ట్యాబ్‌లు చూసే సమయాన్ని తగ్గించి, గాడ్జెట్స్‌ని నైట్‌ మోడ్‌లో పెట్టడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది.

Updated Date - Nov 11 , 2024 | 02:15 AM