Share News

Navya : బిల్లాలో నటించనన్న జయలలిత

ABN , Publish Date - Jul 07 , 2024 | 12:34 AM

అమితాబ్‌ నటించిన ‘డాన్‌’ సినిమాని తమిళంలో ‘బిల్లా’ పేరుతో రీమేక్‌ చేశారు. రజనీకాంత్‌, శ్రీప్రియ జంటగా నటించిన ఈ చిత్రం 1980లో విడుదలైంది.

Navya : బిల్లాలో నటించనన్న జయలలిత

అమితాబ్‌ నటించిన ‘డాన్‌’ సినిమాని తమిళంలో ‘బిల్లా’ పేరుతో రీమేక్‌ చేశారు. రజనీకాంత్‌, శ్రీప్రియ జంటగా నటించిన ఈ చిత్రం 1980లో విడుదలైంది. అయితే ఇందులో కథానాయిక పాత్రకు మొదట జయలలితనే అనుకొన్న విషయం, ఆమె అందుకు తిరస్కరించిన వైనం చాలామందికి తెలీదు. ఈ విషయాన్ని జయలలితే ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించారు. 1980 మే 25 నాటి ‘సండే’ పత్రికలోని ‘ఖాస్‌బాత్‌’ శీర్షికలో జయలలిత మళ్లీ సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నారని వార్త రాశారు. దానిపై జయలలిత ఘాటుగా స్పందిస్తూ ఆ పత్రికకు ఓ లేఖ రాశారు.

‘రజనీకాంత్‌ హీరోగా నిర్మాత బాలాజీగారు నిర్మించిన ‘బిల్లా’ చిత్రంలో హీరోయిన్‌గా నటించమని మొదట నన్నే అడిగారు. నేను కాదన్న తర్వాతే శ్రీప్రియను బుక్‌ చేశారు. కళ్లు చెదిరే పారితోషికం ఆఫర్‌ ఇచ్చినా నేను ఒప్పుకోలేదు. సినిమా కెరీర్‌ మీద నాకు ఆసక్తి సన్నగిల్లింది. దేవుడి దయవల్ల నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. మిగిలిన జీవితంలో కూడా మహారాణిలా బతకగలను’ అని ఆ లేఖలో స్పష్టం చేశారు జయలలిత. చెప్పినట్లుగానే ఆవిడ తదనంతర కాలంలో మహారాణిలానే బతికారు

Updated Date - Jul 07 , 2024 | 12:34 AM