Share News

కర్పూరవల్లి కమనీయం

ABN , Publish Date - Oct 01 , 2024 | 05:41 AM

వాము ఆకునే కర్పూరవల్లి అంటారు. దీనికి మెక్సికన్‌ మింట్‌ అనే ఇంకొక పేరు కూడా ఉంది. కొద్దిపాటి జాగ్రత్తలతో, చిన్న ప్రదేశాల్లో ఈ మొక్కను పెంచుకోవచ్చు. పోషకాల నిలయమైన

కర్పూరవల్లి కమనీయం

వాము ఆకునే కర్పూరవల్లి అంటారు. దీనికి మెక్సికన్‌ మింట్‌ అనే ఇంకొక పేరు కూడా ఉంది. కొద్దిపాటి జాగ్రత్తలతో, చిన్న ప్రదేశాల్లో ఈ మొక్కను పెంచుకోవచ్చు. పోషకాల నిలయమైన ఈ ఆకుతో ఒరిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!

  • ఈ ఆకు, గొంతు నొప్పి, జలుబులను తగ్గిస్తుంది. ఆకును నమలి, రసం మింగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఆకు రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల జలుబు తగ్గుతుంది.

  • వానాకాలం, చలికాలాల్లో ఈ ఆకుతో బజ్జీలు వండుకుని తినడం ద్వారా దీన్లోని ఔషధగుణాలను ఉపయోగించుకోవచ్చు.

  • ఈ ఆకులను నూరి గాయాలకు, దెబ్బలకూ, కాలిన బొబ్బలకూ పట్టు వేయవచ్చు.

  • అజీర్తి, నోటి పుండ్లు, చర్మ ఇన్‌ఫెక్షన్లు, వెక్కిళ్లు, పొట్టలో నొప్పుల నుంచి ఈ ఆకు ఉపశమనాన్ని అందిస్తుంది.

  • ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం ఈ ఆకులతో తయారుచేసుకున్న కషాయం తాగాలి.

  • కర్పూరవల్లి ఆకులను మరగకాచి, ఆవిరి పడితే ఛాతీలో పేరుకున్న కఫం కరుగుతుంది. రసాన్ని ఛాతీకి పూసుకున్నా ఫలితం ఉంటుంది.

  • కర్పూరవల్లితో తయారుచేసిన ఎసెన్షియల్‌ ఆయిల్‌, యాంటీ కేన్సర్‌ గుణాలను కనబరిచినట్టు పరిశోధనల్లో రుజువైంది.

Updated Date - Oct 01 , 2024 | 05:42 AM