Share News

Littles : ఉప్పు కషాయం!

ABN , Publish Date - May 19 , 2024 | 12:07 AM

ఒక ఊరిలో ఓ ఆసామి ఉండేవాడు. డబ్బున్నవాడు. ఆయనకు కొడుకు, కూతురు ఉండేవారు.

Littles :  ఉప్పు కషాయం!

ఒక ఊరిలో ఓ ఆసామి ఉండేవాడు. డబ్బున్నవాడు. ఆయనకు కొడుకు, కూతురు ఉండేవారు. కొడుక్కు పెళ్లి సంబంధాలు చూశాడు. ధనికులైన అమ్మాయి వద్దనుకున్నాడు. అందుకే తన కొడుకు సాధారణ మధ్యతరగతి అమ్మాయిని కోడలి పిల్లగా తెచ్చుకున్నాడు. కోడలు కనీసం ఇంట్లో పనులైనా చేస్తుందని.

ఆసామి భార్య, కూతురు ఎప్పటినుంచో ఉన్నారు కాబట్టి వారిద్దరి ఆలోచనలు. పరాయి ఇంటినుంచి వచ్చిన కోడలికి ప్రతిదీ వింత సమస్యగా ఉండేది. ఏ పని చేయాలో అర్థం అయ్యేది కాదు. ‘ఈ ఇంటి పని ఎప్పుడు అర్థం చేసుకుంటావో’ అని నసిగేవాళ్లు. కొడుకు మాత్రం ‘ముగ్గురు ఒకేచోట ఉంటే ఇంతే’ అని అనుకునేవాడు. ఆ ఇంట్లో అంతా అవకతవకల పని ఉండేది. దీంతో ఆసామికి కోపమొచ్చేది. అయితే పూర్వకాలంలో పిల్లలు విడిగా ఉండటం నేరంగా భావించేవారు కాబట్టి తన కొడుకు అక్కడే ఉండిపోయాడు.


ఒకరోజు ఆసామి ఇంటికి కోడలు పిల్ల తండ్రి వచ్చాడు. మర్యాదలు చేశారు. అత్త మాత్రం నీళ్లకోసం బయటకు వెళుతూ ‘ఎప్పటిలానే మర్చిపోవద్దు.. ఆ కూరలో ఉప్పేయటం మర్చిపోవద్దు’ అన్నది. అలానే అత్తయ్య అన్నది కోడలు. ఆసామి కూతురు మాత్రం గేదెల పాకలోకి పనిమీద వెళ్లింది. అక్కడ పిడకలు కొట్టింది. వేగంగా వచ్చి ‘ఈ పిల్ల ఉప్పేసిందో లేదోన’ని గుప్పెడు ఉప్పు వేసింది. ఆమె పనిలోకి వెళ్లిపోయింది మళ్లీ. ‘అసలే మనకు ఇబ్బందులు. ఆ ఉప్పు మర్చిపోరాదని ఉప్పు వేసింది. ఆహా మంచి పని చేశా’ అనుకుంది కోడలుపిల్ల.

ఆ తర్వాత బయటికి నీళ్లకోసం వెళ్లిన అత్త పొయ్యిని చూసింది. పప్పు ఉడుకుతోంది. ఉప్పు వేసేవారు లేరని ఉప్పేసింది. ఆ తర్వాత పప్పు చేశారు. ఆసామి అతిథిని పిలిచాడు. ఇద్దరూ కూర్చున్నారు. వెంటనే కోడలు పిల్ల తండ్రి రుచి చూస్తూనే ‘ఉప్పు వేయలేదే’ అన్నాడు. ‘నేను వేశా ఉప్పు’ అంటూ ముగ్గురూ అన్నారు. ఆసామి రుచి చూశాడు. ఇది ఉప్పు కాషాయం అని గట్టిగా అరిచాడు. ఎవరి పనులు వాళ్లు చేయాలి. మీ ముగ్గురి మధ్య స్నేహం లేదు. ముందు అది చూసుకోండి. పని విభజించుకోండి అని గట్టిగా అరిచాడు. ఆ తర్వాత తప్పు జరగలేదు.

Updated Date - May 19 , 2024 | 12:07 AM