Share News

Littles : అనువు గాని చోట

ABN , Publish Date - Aug 02 , 2024 | 05:43 AM

ఒక అడవిలో పెద్ద అల్లరి కోతుల గుంపు ఉండేది. ఒక రోజు వాటికి ఎక్కడా నీళ్లు దొరకక చాలా దాహం వేసింది. ఆ గుంపులో పెద్దకోతి తొందరగా గొంతు తడుపుకోకపోతే నేను చచ్చిపోయేలాగా ఉన్నాను అన్నది.

Littles : అనువు గాని చోట

Story : ఒక అడవిలో పెద్ద అల్లరి కోతుల గుంపు ఉండేది. ఒక రోజు వాటికి ఎక్కడా నీళ్లు దొరకక చాలా దాహం వేసింది. ఆ గుంపులో పెద్దకోతి తొందరగా గొంతు తడుపుకోకపోతే నేను చచ్చిపోయేలాగా ఉన్నాను అన్నది. గుంపులోని మరో కోతి అదిగో అక్కడ మంచినీళ్లు ఉన్నాయి అల్లంత దూరంలో అని దూరంగా మెరుస్తున్న ఎండమావిని చూపించింది. అదేమిటో తెలియని మిగతా కోతులు ఉత్సాహంగా సరే అని, అటు వైపు వెళ్లాలి అనుకున్నాయి.

పక్కనే ఉన్న పొదలో ఉండి ఈ మాటలన్నీ విన్న చిన్న కుందేలు పిల్ల ఒకటి పాపం ఈ కోతులకు సాయం చేద్దామని అనుకుని, వాటితో ఇలా అన్నది. ‘మిత్రులారా ఎక్కడైనా ఎండ మావుల్లో నీరు ఉంటుందా? అది మన భ్రమ మాత్రమే నీటిలాగా కనిపిస్తుంది కానీ అది నీరు కాదు’ అని చెప్పింది.

ఆ మాటలు విన్న కోతులు ‘మాకు తెలియదా ఏం చేయాలో? మేమంత తెలివి తక్కువ వాళ్లమా? నువ్వు మాకు నేర్పుతావా?’ అని విరుచుకు పడ్డాయి. ఆ కుందేలు అప్పటికీ ఊరుకోక ఇంకా ఏదో చెప్పబోయింది. వెంటనే కోతులు దాని మీదకు దూకి దాన్ని గాయ పరిచాయి. అందుకే తగని చోట మనకు అనువు గాని చోట ఎక్కువ మాటలాడకూడదు.

Updated Date - Aug 02 , 2024 | 07:02 AM