Share News

Littles: వంటవాడి సమయ స్ఫూర్తి

ABN , Publish Date - Aug 31 , 2024 | 02:43 AM

వందన గిరి రాజ్యాన్ని ప్రవీణుడు అనే రాజు పాలించే వాడు అతనికి చాలా ముక్కోపి అని పేరుండేది. అతని దగ్గర ధర్మయ్య అనే వంటవాడు ఉండేవాడు.

Littles: వంటవాడి సమయ స్ఫూర్తి

Littles : వందన గిరి రాజ్యాన్ని ప్రవీణుడు అనే రాజు పాలించే వాడు అతనికి చాలా ముక్కోపి అని పేరుండేది. అతని దగ్గర ధర్మయ్య అనే వంటవాడు ఉండేవాడు. అతను చేసే వంటకాలంటే మహారాజుకు చాలా ఇష్టం ఉండేది. ఒక రోజు ధర్మయ్య త్వరత్వరగా వంట పూర్తి చేసి, తన కొడుక్కి అనారోగ్యంగా ఉండటంతో మహారాజుకు వడ్డించే పనిని మరొక పనివాడికి అప్పగించి తాను ఇంటికి వెళ్లిపోయాడు. ఆ రోజు కూరల్లో కారం ఎక్కువ అయింది.

మహారాజు రుచి చూడగానే కారం ఎక్కువయిందని తెలిసి, కోపంతో ఆ మర్నాడు ధర్మయ్యకి మరణ దండన విధించాలని నిర్ణయం చేశాడు. ఇది తెలిసిన ధర్మయ్య రాజు కొలువుకువచ్చి ‘మహారాజా చనిపోయే ముందు ఎవరిదైనా చివరి కోరిక తీరుస్తారు కదా. అలాగే నా చివరి కోరిక కూడా తీర్చండి. నాకు ఓ ధనుస్సు, బాణం కావాలి తెప్పించండి. ఆ బాణం నేను రాజుగారి మీద వేయాలి అనుకుంటున్నాను’ అన్నాడు అదేమిటి? అని అడిగినరాజుతో ధర్మయ్య ‘‘కేవలం కూరలో కారం ఎక్కువ అయినందుకే నా ప్రాణం తీశారనే అపకీర్తి మీకు వద్దు మహారాజా.. ఇపుడు ఇంత హాని మీకు తలపెట్టాను అని చెప్పి నన్ను

ఉరి తీయించండి’ అన్నాడు శిక్ష తప్పించుకోవడానికి వంటవాడు చూపిన సమయ స్ఫూర్తికి నవ్వుకున్న రాజు అతనికి విఽధించిన మరణదండన రద్దు చేసి, క్షమించి పంపేశాడు అలా ధర్మయ్య ఉపాయంతో తననుతాను కాపాడుకున్నాడు.

Updated Date - Aug 31 , 2024 | 02:43 AM