Share News

మోడర్న్‌ ‘ఇయర్‌ రింగ్స్‌’!

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:17 PM

హ్యాంగింగ్స్‌ లేదంటే స్టడ్స్‌... ఇంతకంటే ఇయర్‌ జ్యువెలరీలో వెరైటీలేముంటాయి? అని అమ్మాయిలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు.

మోడర్న్‌ ‘ఇయర్‌ రింగ్స్‌’!

హ్యాంగింగ్స్‌ లేదంటే స్టడ్స్‌... ఇంతకంటే ఇయర్‌ జ్యువెలరీలో వెరైటీలేముంటాయి? అని అమ్మాయిలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఊహకందని మోడర్న్‌ ఇయర్‌ రింగ్స్‌ మార్కెట్లోకొచ్చేశాయి. డ్రస్సింగ్‌ స్టయిల్‌, డిజైన్‌కి తగ్గ ఈ మెడర్న్‌ ఇయర్‌ రింగ్స్‌ పెట్టుకుంటే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ కచ్చితంగా మీరే!

ఇయర్‌ జాకెట్స్‌: చెవి తమ్మె ముందూ వెనకా రెండు వైపులా ఫిక్స్‌ అయిపోయే ఈ రకం కమ్మలు ఇప్పుడు లేటెస్ట్‌ ఫ్యాషన్‌. ముందు వైపు చిన్న స్టడ్‌ ఉంటే దానికి అటాచ్‌మెంట్‌గా వెనకవైపు కొంచెం పెద్ద సైజు స్టడ్‌ ఉండే వెరైటీ ఇయర్‌ రింగ్స్‌ ఇవి. చెవికి తొడిగినట్టుగా రెండు వైపులా కనిపిస్తాయి కాబట్టే ఈ చెవి పోగులకు ఇయర్‌ జాకెట్స్‌ అని పేరు.

డబుల్‌ సైడెడ్‌ ఇయర్‌ రింగ్స్‌: వెనకది ముందుకు, ముందుది వెనక్కి మార్చి మార్చి పెట్టుకునే వీలుండేలా తయారైన ఇయర్‌ రింగ్స్‌ ఇవి. డ్రస్‌కి నప్పేట్టుగా, స్టయిల్‌కి తగ్గట్టుగా ఒకే ఇయర్‌ రింగ్‌ని మార్చుకునే వీలుంది కాబట్టే వీటికి డబుల్‌ సైడెడ్‌ ఇయర్‌ రింగ్స్‌ అని పేరు.

ఫ్రంట్‌ బ్యాక్‌ ఇయర్‌ రింగ్స్‌: చెవి పోగు వెనకుండే హుక్‌కు ఆకర్షణ తెచ్చిపెట్టే ఈ రకం ఇయర్‌ రింగ్స్‌ చూడముచ్చటగా ఉంటాయి. కమ్మతోపాటు వెనకవైపుంటే హుక్‌ పెట్టుకున్నప్పుడు ఓ బొమ్మ లేదా ఓ ఆకారం కనిపించటం ఫ్రంట్‌ బ్యాక్‌ ఇయర్‌ రింగ్స్‌ ప్రత్యేకత.

ఇయర్‌ కఫ్స్‌: చెవులు మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే చెవి మొత్తాన్ని కవర్‌ చేసే ఆభరణం పెట్టుకోవాలి. ఈ ఐడియాతో తయారైనవే ఇయర్‌ కఫ్స్‌. చూడటానికి కాస్త పెద్దవిగా చెవి మొత్తాన్ని కవర్‌ చేసే ఇయర్‌ కఫ్స్‌ ఎన్నో వెరైటీ మెటీరియల్స్‌, డిజైన్స్‌తో తయారవుతాయి.

Updated Date - Feb 20 , 2024 | 11:17 PM