Share News

Dr. Siri Lakshmi's : సమంతకు క్షమాపణలు

ABN , Publish Date - Jul 07 , 2024 | 12:29 AM

ఆరోగ్య సలహాలను సోషల్‌ మీడియాలో అందించింనందుకు సమంతపై సిరియాక్‌ అబ్బిఫిలిప్స్‌ (లివర్‌ డాక్టర్‌) అనే డాక్టర్‌ సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు బదులిస్తూ సమంత కూడా వివరణ ఇచ్చారు.

Dr. Siri Lakshmi's  : సమంతకు క్షమాపణలు

ఆరోగ్య సలహాలను సోషల్‌ మీడియాలో అందించింనందుకు సమంతపై సిరియాక్‌ అబ్బిఫిలిప్స్‌ (లివర్‌ డాక్టర్‌) అనే డాక్టర్‌ సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు బదులిస్తూ సమంత కూడా వివరణ ఇచ్చారు. సమంతను విమర్శించినందుకు శనివారం సమంతకు సారీ చెప్పి.. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్‌ జాకర్స్‌ మోసగాడు అని ఆయన పేర్కొన్నారు. ‘‘సమంతను బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోగలను.

ఆమె ఈ సమస్య నుంచి మరింత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఆమె పోస్ట్‌పై నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నాను. ఈ విషయంలో తప్పంతా ఆమెకు వైద్యం అందించి.. ఇటువంటి హానికరమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయమని సిఫార్సు చేసిన డాక్టర్‌ జాకర్స్‌దే. ఆయన అందరికీ చెప్పుకున్నట్లు ఎంబీబీఎస్‌ చేసిన డాక్టర్‌ కాదు. ఆయన ఓ ప్రకృతి వైద్యుడు. ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయి. అందుకే ఆ డాక్టర్‌ చెప్పిన సూచనలను పోస్ట్‌ చేసిన సమంతను తప్పుబట్టాను’’ అని వివరించారు.

Updated Date - Jul 07 , 2024 | 12:29 AM