Share News

ఇలా చర్మం యవ్వనం

ABN , Publish Date - Feb 22 , 2024 | 02:51 AM

చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే పొడిబారిపోకుండా కాపాడుకోవాలి. వయసు పైబడేకొద్దీ చర్మం సాగే గుణాన్ని కోల్పోయి, ముడతలు పడుతుంది.

ఇలా చర్మం యవ్వనం

కొంతమంది వయసు పైబడినా యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు. అందుకు కారణం వాళ్ల చర్మం యవ్వనంగా ఉండడమే! ఇలాంటి చర్మం సొంతం చేసుకోవడం కోసం కొన్ని అలవాట్లకు దైనందిన జీవితంలో చోటు కల్పించాలి.

చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే పొడిబారిపోకుండా కాపాడుకోవాలి. వయసు పైబడేకొద్దీ చర్మం సాగే గుణాన్ని కోల్పోయి, ముడతలు పడుతుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడం కోసం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి. అలాగే కంటి నిండా నిద్రపోవాలి. చర్మం తేమను కోల్పోకుండా మన్నికైన మాయిశ్చరైజర్‌ ఉపయోగించాలి. స్నానం చేసిన వెంటనే చర్మం మీద తడి ఆరిపోకముందే మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి. అలాగే కాలంతో సంబంధం లేకుండా నాణ్యమైన సన్‌స్ర్కీన్‌ లోషన్‌ను వాడుకుంటూ ఉండాలి. ఎండ సోకడం వల్ల చర్మం జీవం కోల్పోతుంది. కాబట్టి ఎండలోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా చేతులకు కూడా సన్‌స్ర్కీన్‌ అప్లై చేసుకోవాలి. గరుకుగా ఉండే స్క్రబర్స్‌ ముఖానికి వాడకూడదు. సబ్బుకు బదులుగా ఫేస్‌ వాష్‌ అలవాటు చేసుకోవాలి. అలసటకు గురైనా, జబ్బు పడినా చర్మం జీవం కోల్పోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి. అలాగే చర్మాన్ని యవ్వనంగా ఉంచే ఆహార పదార్థాలకు భోజనంలో చోటు కల్పించాలి. సలాడ్లు, పండ్లు ఎక్కువగా తినాలి. ప్రొటీన్లు, పీచు ఆహారంలో సరిపడా ఉండేలా చూసుకోవాలి. చక్కెర చర్మానికి శత్రువు. కాబట్టి తీపి పదార్థాలను పరిమితంగానే తీసుకోవాలి. అలాగే శీతల పానీయాలు, మద్యాలకు దూరంగా ఉండాలి.

Updated Date - Feb 22 , 2024 | 02:51 AM