Share News

పిల్లల్లో సిగ్గు పోవాలంటే..

ABN , Publish Date - Feb 22 , 2024 | 02:47 AM

ఇంట్లోకి ఎవరైనా వస్తూనే కొందరు పిల్లలు తల్లిచాటునో, తండ్రి చాటునో దాక్కోవటం.. లేదా ఇంట్లో దాక్కోవటం చేస్తుంటారు. ఆ తర్వాత ఇది అలవాటుగా మారుతుంది.

పిల్లల్లో సిగ్గు పోవాలంటే..

ఇంట్లోకి ఎవరైనా వస్తూనే కొందరు పిల్లలు తల్లిచాటునో, తండ్రి చాటునో దాక్కోవటం.. లేదా ఇంట్లో దాక్కోవటం చేస్తుంటారు. ఆ తర్వాత ఇది అలవాటుగా మారుతుంది. ఇలాంటి పిల్లల్లో సిగ్గును పోగొట్టాలంటే ఈ పద్ధతులు పాటించాలి.

పిల్లలు ఇంట్రోవర్ట్స్‌ కావొచ్చు లేదా పెంపకం వల్ల కావచ్చు. మరేదైనా కావొచ్చు. అనుకోకుండా పిల్లల్లో షైనెస్‌ వస్తుంది. ఒకవేళ కొత్తవారెవరైనా ఇంట్లోకి వచ్చినపుడు అమ్మానాన్నల దగ్గర దాక్కుంటే.. ‘మా పిల్లవాడు సిగ్గుపడతాడు’ లాంటి పదాలు ఉపయోగించకూడదు. సిగ్గు పిల్లవాడు.. అంటూ విశేషణాలు తగిలించాల్సిన అవసరం లేదు. ఈ రోజే మిమ్మల్ని చూసారు కదా.. అందుకే ఇలా. కాస్త అడ్జస్ట్‌ కావాలి.. అంటూ మాట్లాడాలి.

మీ కిడ్‌ బొమ్మలు వేస్తుంటే.. కాస్త ఎంకరేజ్‌ చేయండి. గేమ్స్‌ ఆడితే ప్రశంసించండి. ఇలా ఒక పని బాగా చేసినపుడు కాంప్లిమెంట్స్‌ ఇస్తే కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది. దీనివల్ల షైనెస్‌ తగ్గిపోతుంది. పదిమందితో సులువుగా సోషలైజ్‌ అవుతారు.

కొందరు పిల్లలు ఆడుతుంటే.. ‘మా కిడ్‌ సిగ్గు పడతాడు’ అంటూ అక్కడే కుర్చీ వేసుకుని కూర్చోకూడదు. సొంతంగా పక్కన ఉండే పిల్లలతో ఆడుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే కలుపుగోలుతనం పెరుగుతుంది. కొత్త స్కిల్స్‌ ఏవైనా ఉంటే నేర్పించాలి.

టీవీ, ఫోన్‌ల మీద ఫోకస్‌ తగ్గేలా జాగ్రత్తపడాలి. బొమ్మలు తీసుకుని ఇతర పిల్లలకు ఇవ్వమని ప్రోత్సహించడం.. కలిసి ఆడుకోమని చెప్పటం.. షేరింగ్‌ చేయాలని పదే పదే చెప్పడం చేయాలి. ముఖ్యంగా ఇతర పిల్లలు ఆడుకుంటుంటే వారితో కలిసి ఆడమని ప్రోత్సహించాలి. ఇలాంటి చిన్న పనుల వల్లనే పిల్లలో సిగ్గరితనం పోతుంది.

కమ్యూనికేషన్‌ను అభివృద్ధి చేయటం.. ఆత్మవిశ్వాసాన్ని పెంచటం ద్వారానే పిల్లల్లో భయం పోతుంది. తద్వారా సిగ్గు మెల్లగా తగ్గిపోతుంది.

Updated Date - Feb 22 , 2024 | 02:47 AM