నేడు ముద్దపప్పు బతుకమ్మ
ABN , Publish Date - Oct 04 , 2024 | 12:09 AM
బతుకమ్మ వేడుకల్లో మూడో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు మూడు ఎత్తుల్లో పూలను పేర్చి, శిఖరం మీద గౌరమ్మను ఉంచుతారు.
బతుకమ్మ వేడుకల్లో మూడో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు మూడు ఎత్తుల్లో పూలను పేర్చి, శిఖరం మీద గౌరమ్మను ఉంచుతారు. పేర్పులో చామంతి, మందార తదితర పూలను ఉపయోగిస్తారు. ప్రధానంగా ముద్దపప్పును నివేదిస్తారు కాబట్టి ‘ముద్దపప్పు బతుకమ్మ’గా వ్యవహరిస్తారు.
నైవేద్యం: ముద్దపప్పు, పాలు, బెల్లంతో చేసిన వంటకాలు.