Share News

Navya : ‘గబ్రు’లో గమ్మత్తుగా..

ABN , Publish Date - Jun 27 , 2024 | 02:00 AM

గంజి పట్టించి, ఇస్త్రీ చేయనిదే కాటన్‌ చీరలను కట్టుకోలేం అనుకునే రోజులు పోయాయి.పైగా కాటన్‌ చీరలు వేసవికే పరిమితమనే భావన కూడా అంతరించింది.

Navya : ‘గబ్రు’లో గమ్మత్తుగా..

ఫ్యాషన్‌

గంజి పట్టించి, ఇస్త్రీ చేయనిదే కాటన్‌ చీరలను కట్టుకోలేం అనుకునే రోజులు పోయాయి.పైగా కాటన్‌ చీరలు వేసవికే పరిమితమనే భావన కూడా అంతరించింది. అన్ని చీరల్లాగే నచ్చినప్పుడు కట్టుకునేలా ఇప్పుడెన్నో రకాల కాటన్‌ చీరలు అందుబాటులోకొచ్చాయి. వాటిలో చెప్పుకోదగినవి ‘గబ్రు’ చీరలు. వాటినొకసారి చూసేద్దామా!

హ్యాండ్‌

ప్రింట్‌ గబ్రు కాటన్‌ చీరల మూలాలు రాజస్థాన్‌లో ఉన్నాయి. ఈ సంప్రదాయ రాజస్థానీ పద్ధతి తరతరాలుగా మహిళలను అలరిస్తూనే ఉంది. సహజసిద్ధ రంగులతో ఆకట్టుకునే డిజైన్లను అద్దే ఈ గబ్రు కళ నేటికీ ప్రపంచవ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. గబ్రు హ్యాండ్‌ ప్రింట్‌ కాటన్‌లో మెటీరియల్స్‌, చీరలు రెండింటికీ మంచి ఆదరణ ఉంది. వెలసిపోని రంగులు, డిజైన్లను కలిగి ఉండే గబ్రు చీరలు సాదాసీదా కాటన్‌ చీరల్లా నాలుగైదు ఉతుకులకే వెలసిపోయి, చీకిపోకుండా ఎక్కువ కాలం మన్నడం వల్ల కూడా మహిళలు వీటిని క్యాజువల్‌ వేర్‌గా ఎంచుకుంటూ ఉంటారు.

సొగసులీనుతూ...

గబ్రు చీరల్లో రెట్టింపు ఆకర్షణీయంగా కనిపించడం కోసం కొన్ని ఫ్యాషన్‌ చిట్కాలు పాటించాలి. అవేంటంటే....

  • సింపుల్‌గా, హూందాగా కనిపించాలంటే, తేలిక రంగులు, చిన్న డిజైన్లు, సన్నని బార్డర్లు కలిగి ఉండే బగ్రు చీరలనే ఎంచుకోవాలి. ఇలాంటి చీరలు ఆఫీస్‌ వేర్‌గా కూడా చాలా బాగుంటాయి.

  • స్నేహితులతో సరదాగా షికారుకు బయల్దేరేటప్పుడు ముదురు ఎరుపు, నీలం, పసుపు కాంట్రాస్ట్‌ చీరలు బాగుంటాయి. ఫ్యాషన్‌గా కనిపించడం కోసం పొట్టి చేతులు, కాలర్‌ కలిగిన బ్లౌజ్‌లు లేదంటే స్వీల్‌లెస్‌ బ్లౌజులు ఎంచుకోవాలి.

  • ఫ్యామిలీ గెట్‌ టు గెదర్స్‌లో నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే, సింపుల్‌ జ్యువెలరీతో చీరను మ్యాచ్‌ చేయాలి.

  • మెత్తగా, హాయిగొలిపే గబ్రు చీరల అందమంతా వాటి మీది అద్దకంలోనే ఉంటుంది. రంగులు, ప్రింట్లు వెలసిపోకుండా ఉండడం కోసం వీటిని నీడ పట్టునే ఆరేస్తూ ఉండాలి. తక్కువ వేడి మీద ఇస్త్రీ చేయించుకోవాలి.

Updated Date - Jun 27 , 2024 | 02:00 AM