Share News

NRI: 4 ఏళ్ల తరువాత ఇంటికి బయలుదేరిన ఎన్నారై యువతి.. విమానంలోనే దుర్మరణం!

ABN , Publish Date - Jul 01 , 2024 | 07:05 PM

నాలుగేళ్ల తరువాత ఇంటికి బయలుదేరానన్న ఆనందం ఆ యువతికి కొద్ది సేపు కూడా మిగల్లేదు. అప్పటికే అనారోగ్యంతో సతమతమవుతున్న యువతి విమానం ఎక్కి సీట్లో కూర్చునే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది

NRI: 4 ఏళ్ల తరువాత ఇంటికి బయలుదేరిన ఎన్నారై యువతి..  విమానంలోనే దుర్మరణం!

ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్ల తరువాత ఇంటికి బయలుదేరానన్న ఆనందం ఆ యువతికి కొద్ది సేపు కూడా మిగల్లేదు. అప్పటికే అనారోగ్యంతో సతమతమవుతున్న యువతి విమానం ఎక్కి సీట్లో కూర్చుని సీటు బెల్టు పెట్టుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది. మెల్బోర్న్‌ విమానాశ్రయంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ ఉదంతం సంచలనంగా (NRI) మారింది (Indian Origin Woman In Australia Boards Flight To Visit Home For The First Time In Four Years Dies Inside Plane).

UK: రిషి సునాక్‌పై జాత్యాహంకార వ్యాఖ్యలు.. పాకీ అంటూ రెచ్చిపోయిన నేత!


మన్‌‌ప్రీత్ అనే యువతి 2020లో ఆస్ట్రేలియాకు వెళ్లింది. షెఫ్ కావాలనే లక్ష్యంతో ఆమె అక్కడకు వెళ్లింది. అప్పటికే ఆమె టీబీతో ఇబ్బంది పడుతున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఎయిర్ పోర్టు వెళ్లే ముందే మన్‌ప్రీత్‌ ఒంట్లో బాలేదని ఆమె స్నేహితులు తెలిపారు. కానీ, ఎలాగొలా కాంటాస్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కిన ఆమె తన సీటులో కూర్చుని బెల్టుపెట్టుకునే క్రమంలో ఒక్కసారిగా ముందుకు పడిపోయింది.

అప్పటికి విమానం ఇంకా బోర్డింగ్ గేటు వద్దే ఉండటంతో విమాన సిబ్బందితో పాటు ఎమర్జెన్సీ సిబ్బంది ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ యువతి అప్పటికే కన్నుమూసింది. యువతికి అప్పటికే అనారోగ్యం ఉండటంతో పరిస్థితి వేగంగా విషమించి ఉండొచ్చని స్థానిక మీడియా చెబుతోంది. యువతి ప్రస్తుతం ఆస్ట్రేలియా పోస్టులో పనిచేస్తోంది.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jul 01 , 2024 | 08:19 PM