Share News

Viral: ఫ్రీగా పనిచేస్తా.. ఒక్క జాబ్ ప్లీజ్! యూకేలో భారతీయ యువతి వేడుకోలు

ABN , Publish Date - Nov 07 , 2024 | 09:21 PM

‘‘ఒక్క జాబ్ ఇవ్వండి ప్లీజ్.. జీతం లేకపోయినా పరవాలేదు’’ అంటూ బ్రిటన్‌లోని ఓ భారతీయ విద్యార్థిని నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Viral: ఫ్రీగా పనిచేస్తా.. ఒక్క జాబ్ ప్లీజ్! యూకేలో భారతీయ యువతి వేడుకోలు

ఇంటర్నెట్ డెస్క్: ‘‘ఒక్క జాబ్ ఇవ్వండి ప్లీజ్.. జీతం లేకపోయినా పరవాలేదు’’ అంటూ బ్రిటన్‌లోని ఓ భారతీయ విద్యార్థిని నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది. ఈ పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లీసెస్టర్‌లో ఉంటున్న యువతి లింక్డ్‌‌‌ఇన్‌లో ఈ పోస్టు పెట్టింది. వీసా స్పాన్సర్ చేసే జాబ్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. మరో మూడు నెలల్లో తన గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితి ముగిసిపోతుంది ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ 300 జాబ్స్‌కు దరఖాస్తు చేసుకున్నా ఒక్కటీ రాలేదని వాపోయింది. మరో దారి లేక ఈ పోస్టు పెడుతున్నట్టు చెప్పుకొచ్చింది.

Viral: లీవ్ ఇవ్వని బాస్.. వీడియో కాల్‌‌‌లో పెళ్లి చేసుకున్న యువకుడు


‘‘నేను శాలరీ తీసుకోకుండానే పని చేస్తా. రోజుకు 12 గంటల పని చేయడానికీ రెడీనే. వారానికి ఏడు రోజులు పనిచేస్తా. ఒక్క సెలవు కూడా తీసుకోను. కనీసం ఒక నెల రోజులు జాబ్ ఇచ్చి చూడండి. నా పనితీరు నచ్చకపోతే అప్పటికప్పుడు జాబ్ నుంచి తొలగించండి’’ అని ఆమె అభ్యర్థించింది. తాను 2021లో బ్రిటన్‌కు వచ్చానని, గతేడాదంతా చేసిన ఉద్యోగ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పుకొచ్చింది. ‘‘ఈ జాబ్ మార్కెట్ చూస్తుంటే నా చదువుకు, నైపుణ్యాలకు, డిగ్రీకి అసలు విలువేలేనట్టు ఉంది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. బ్రిటన్‌లో పనిచేసేందుకు ఇదే తన చివరి ఛాన్స్ అని వాపోయింది.

USA: షాకింగ్.. గర్ల్‌ఫ్రెండ్ హెయిర్ స్టైల్ నచ్చక కత్తితో పొడిచి హత్య!


యువతి ఆవేదనతో పెట్టిన పోస్టుపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘జాబ్ కోసం ఇలా కాళ్లావేళ్లా పడటం ఇండియన్స్‌పై చెడు అభిప్రాయాన్ని కలగజేస్తుంది. ఇతర ఉద్యోగార్థులకు ఇది చేటు చేస్తుంది’’ అని ఓ వ్యక్తి అన్నాడు. బ్రిటన్‌లో ఉద్యోగం సాధించడం విదేశీయులకు ఎంత కష్టమో ఈ పోస్టు చెబుతోందని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఈసారి ఆమెకు జాబ్ దొరక్కపోతే భారీ లోన్ భారంతో ఇండియాకు తిరిగెళ్లాలి’’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

కాగా, 2021లో బ్రిటన్‌ గ్రాడ్యుయేట్ వీసా ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, డిగ్రీ పూర్తి చేసిన విదేశీ విద్యా్ర్థులు రెండేళ్ల వరకూ ఉద్యోగం లేకపోయినా బ్రిటన్‌లో ఉండొచ్చు. పీహెచ్‌డీ చేసిన వారికి మూడేళ్ల వరకూ జాబ్ వెతుక్కునేందుకు అవకాశం ఉంది. ఆ తరువాత వారు కచ్చితంగా సొంత దేశాలకు తిరిగెళ్లిపోవాలి.

Read Latest and Health News

Updated Date - Nov 07 , 2024 | 09:28 PM