Share News

Pranjali Awasthi : జస్ట్ 16 ఏళ్లకే స్టార్టప్ కంపెనీ స్థాపించి.. రికార్డు సృష్టించిన ప్రాంజలి అవస్థి

ABN , Publish Date - Aug 24 , 2024 | 07:34 PM

టీనేజ్ వయస్సులో పిల్లలు ఇంటర్ అ తర్వాత డిగ్రీ లేదా ఇంజనీరింగ్ అదీ కూడా కాకుంటే డాక్టర్‌ కావాలనుకొంటారు. భవిష్యత్తు గురించి ఆ దిశగా ఆలోచన చేస్తూ.. అటు వైపు అడుగులు వేస్తారు. కానీ ఆ వయస్సులో కంపెనీ స్థాపించాలని.. అది కూడా విభిన్న రంగానికి చెందిన సంస్థను ఏర్పాటు చేయాలని ఏ టీనేజర్ కలలో కూడా ఊహించుకోరు.

Pranjali Awasthi : జస్ట్ 16 ఏళ్లకే స్టార్టప్ కంపెనీ స్థాపించి.. రికార్డు సృష్టించిన ప్రాంజలి అవస్థి
Pranjali Awasthi

టీనేజ్ వయస్సులో పిల్లలు ఇంటర్ అ తర్వాత డిగ్రీ లేదా ఇంజనీరింగ్ అదీ కూడా కాకుంటే డాక్టర్‌ కావాలనుకొంటారు. భవిష్యత్తు గురించి ఆ దిశగా ఆలోచన చేస్తూ.. అటు వైపు అడుగులు వేస్తారు. కానీ ఆ వయస్సులో కంపెనీ స్థాపించాలని.. అది కూడా విభిన్న రంగానికి చెందిన సంస్థను ఏర్పాటు చేయాలని ఏ టీనేజర్ కలలో కూడా ఊహించుకోరు.

Also Read: RG Kar college ex-principal: ప్రొ. సందీప్ ఘోష్‌పై సీబీఐ కేసు నమోదు


కానీ 16 ఏళ్ల ప్రాంజల్ అవస్థి మాత్రం ఆ దిశగా ఆలోచించి.. అడుగులు వేసింది. ప్రపంచానికి ఇప్పుడిప్పుడే పరిచయమవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు సంబంధించిన సంస్థను ఏర్పాటు చేసి.. జస్ట్ ఏడాదిలోనే ఆ సంస్థ విలువ రూ.100 కోట్లకు చేరుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌లో అపర బాల మేధావిగా ఖ్యాతీ గాంచిన ప్రాంజలి అవస్థి 2022లో డెల్వి.ఏఐ పేరుతో స్టార్టప్ కంపెనీని స్థాపించింది.

Also Read: Maharastra: స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు: 22 మంది కార్మికులకు గాయాలు


11 ఏళ్ల వయస్సులో భారత్‌ నుంచి అమెరికాలోని ఫ్లొరిడా వెళ్లిన ప్రాంజలి అవస్థికి అక్కడ కొత్త అవకాశాలు తలుపు తట్టాయి. 13 ఏళ్ల వయస్సులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో రెండేళ్ల కంప్యూటర్ సైన్స్‌తోపాటు మేథమెటిక్స్‌లో ఇంటర్న్ షిప్ చేస్తుంది. ఆ క్రమంలో రిసెర్చ్ ల్యాబ్‌లో ఉన్న ఆమెకు డెల్వీ.ఏఐ‌ సంస్థను ఏర్పాటు చేయాలని మెరుపులాంటి ఆలోచన వచ్చింది.

Also Read: Uttar Pradesh: పీఎం మోదీ, సీఎం యోగిలను ప్రశంసించి భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త


అలా ఈ సంస్థ ఏర్పాటుకు బీజం పడింది. మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్‌లో సైతం ప్రాంజలి అవస్థి పని చేసింది. ఆ క్రమంలో పలు సమస్యలను.. ఎలా పరిష్కరించాలనే దిశగా ఆమె పరిశోధన సాగించింది. తద్వారా డేటాను వెలికి తీయడం, అధిక డేటాను తొలగించడంతోపాటు డేటా సిలోస్‌ను తొలగించేందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎలా వినియోంచుకోవచ్చో ఆమె స్థాపించిన డెల్వీ. ఏఐ పరిశోధించింది.. అందుకు అనుగుణంగా ఫలితాలు సాధించింది.

Also Read: Mumbai Dating scam: అబ్బాయిలను బురిడీ కొట్టిస్తున్న అందమైన అమ్మాయిలు


ప్రాంజలి స్థాపించిన ఈ స్టార్టప్ కంపెనీ 3.7 కోట్ల నిధులను సేకరించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 10 మంది ఉద్యోగుల బృందం పని చేస్తుంది. ఈ కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే దీని విలువ రూ.100 కోట్లకు చేరుకుంది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌లో ప్రాంజలి అవస్థి చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.

Jammu Kashmir Assembly Elections: నేషనల్ కాన్ఫరెన్స్‌లో నేతలు తిరుగుబాటు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 24 , 2024 | 08:30 PM