Share News

NRI: అమెరికాలో దారుణం! కొత్తగా పెళ్లైన భారత సంతతి యువకుడి కాల్చివేత

ABN , Publish Date - Jul 21 , 2024 | 09:08 PM

అమెరికాలో దారుణం వెలుగు చూసింది. రోడ్డుపై తలెత్తిన వివాదంలో ఓ వాహనదారుడు కొత్తగా పెళ్లైన భారత సంతతి అమెరికా యువకుడిని తుపాకీతో కాల్చేశాడు. స్వీయ రక్షణ క్రమంలో అతడు భారత సంతతి యువకుడిపై కాల్పులు జరిపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

NRI: అమెరికాలో దారుణం! కొత్తగా పెళ్లైన భారత సంతతి యువకుడి కాల్చివేత

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో దారుణం వెలుగు చూసింది. రోడ్డుపై తలెత్తిన వివాదంలో ఓ వాహనదారుడు కొత్తగా పెళ్లైన భారత సంతతి అమెరికా యువకుడిని (NRI) తుపాకీతో కాల్చేశాడు. స్వీయ రక్షణ క్రమంలో అతడు భారత సంతతి యువకుడిపై కాల్పులు జరిపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియానా రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

NRI: 4 ఏళ్ల తరువాత ఇంటికి బయలుదేరిన ఎన్నారై యువతి.. విమానంలోనే దుర్మరణం!


స్థానిక పోలీసుల కథనం ప్రకారం, గత మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై కాల్పులు జరిగాయన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులకు భారత అమెరికన్ యువకుడు గెవిన్ దసౌర్.. తూటా గాయాలతో కుప్పకూలిపోయి కనిపించాడు. తన కళ్లముందే అతడు కుప్పకూలిపోయాడని పక్కనే ఉన్న యువకుడి భార్య వీవియన్ జమోరా వెల్లడించింది. తన భర్తపై కాల్పులు జరిపిన వ్యక్తిని కూడా గుర్తించింది. ఆగ్రాకు చెందిన దసౌర్ రెండు వారాల క్రితమే మెక్సికోకు చెందిన వీవియన్‌ను పెళ్లాడాడు. తన భర్త పరోపకారి అని, ఎవరికీ హాని తలపెట్టే వ్యక్తి కాదని వీవియన్ కన్నీరుమున్నీరైంది (Newly-wed Indian-origin man shot dead in US in suspected road rage incident).


కాగా, కాల్పుల ఘటనను మరో వాహనదారుడు తన కెమెరాలో రికార్డు చేసినట్టు పోలీసులు తెలిపారు. నాలుగు రోడ్ల కూడలి వద్ద దసౌర్‌కు, అటుగా కారులో వచ్చిన మరో వాహనదారుడికి మధ్య వివాదం తలెత్తింది. ఆ సమయంలో దసౌర్ చేతిలో తుపాకీ ఉన్నట్టు కూడా కనిపించింది. కారులోని వ్యక్తితో వాదించే క్రమంలో దసౌర్ తన తుపాకీ ఒక చేతిలోంచి మరో చేతిలోకి తీసుకున్నాడు. ఈ క్రమంలోనే కారులోని వ్యక్తి దసౌర్‌పై కాల్పులు జరిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని ప్రశ్నించాక విడిచిపెట్టారు. దీంతో, నిందితుడు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపి ఉండొచ్చని భావిస్తున్నారు. వివాదం సమయంలో దసౌర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడని స్థానిక మీడియా పేర్కొంది.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jul 21 , 2024 | 09:19 PM