Share News

NRI: సింగపూర్లో ఘనంగా పాట షికారుకొచ్చింది పుస్తక పరిచయ కార్యక్రమం

ABN , Publish Date - May 20 , 2024 | 05:52 PM

శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు వారి ఆధ్వర్యంలో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఒన్ కాన్ బెర్రా పంక్షన్ హాల్లో, 19 మే ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది.

NRI: సింగపూర్లో ఘనంగా పాట షికారుకొచ్చింది పుస్తక పరిచయ కార్యక్రమం

శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు వారి (NRI) ఆధ్వర్యంలో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఒన్ కాన్ బెర్రా పంక్షన్ హాల్లో, 19 మే ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. పుస్తక రచయిత, సివిల్స్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమానిగా ఆకెళ్ళ రాఘవేంద్ర అందరికీ సుపరిచితులు. ఈ కార్యక్రమంలో పాట షికారుకొచ్చింది పుస్తక రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకూ దాదాపు 200 పైగా వేదికల మీద మాట్లాడినా కుటుంబ సమేతంగా ఓ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మొదటిసారి ఇక్కడే కుదిరిందని అన్నారు. ఇంతకు ముందు ఎన్ని సార్లు ప్రయత్నించినా వీలు కానిది ఈ సింగపూరు సభ ద్వారా జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే వ్యాఖ్యాత సుబ్బు పాలకుర్తి తన గురించి ఎంతో శోధించి పరిచయ వాక్యాలు వ్రాసారని ప్రశంసించారు.

2.jpgNRI: ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు

పాట షికారుకొచ్చింది పుస్తకం తన గురువులు అయిన సీతారామ శాస్త్రి పాటలను, జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ వ్రాసింది అని ఆకేళ్ల రాఘవేంద్ర చెప్పారు. ప్రతి పాట వెనుక ఉన్న కథను అందరికీ చేరవెయ్యాలనే ఉద్దేశ్యంతో ప్రాణం పెట్టి వ్రాసిన పుస్తకము ఇదని తెలియజేసారు. ఈ సందర్బంగా సిరివెన్నెలతో తనకు ఉన్న అనుబందాన్ని, వారు తనను ప్రోత్సహించిన వైనాన్ని ఆహూతులందరితోనూ పంచుకున్నారు. సింగపూరులో శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ముగించి వెళుతుంటే ఏదో పుట్టినిల్లుపై మమకారాన్ని దాచుకోలేని ఒక పెళ్ళికూతురు వెళ్ళలేక వెళ్ళలేక మెట్టినింటికి వెళుతున్నట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సంస్థ ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా తప్పక వస్తానని, సింగపూరు వారి ఆప్యాయత తనను కట్టిపడేసింది అని కార్యక్రమానికి విచ్చేసిన సిరివెన్నెల అబిమానులందరికీ కృతజ్ఞతలు చెబుతూ భావోద్వేగానికిలోనయ్యారు.

3.jpg


సుబ్బు వి పాలకుర్తి సభ నిర్వహణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, శ్రీ సాంస్కృతిక కళా సారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ సిరివెన్నెల జయంతి అయిన మే 20వ తేదీకి ఒక్కరోజు ముందు ఆయన జీవిత పుస్తకాన్ని, పుస్తక రచయిత, సిరివెన్నెల ఆత్మీయ శిష్యులైన ఆకెళ్ళ రాఘవేంద్ర ద్వారా సింగపూర్‌లో ఆవిష్కరించుకోవడం చాలా ఆనందదాయకమని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలును తెలియజేసారు. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సిరివెన్నెలను స్మరించుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా మరొక్కసారి అందరికీ దక్కిందని అన్నారు. తెలుగు అక్షరం ఉన్నంత వరకూ సిరివెన్నెల పాట తెలుగు వారి నోటివెంట వినబడుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు.

5.jpgఈ కార్యక్రమానికి రామాంజనేయులు చామిరాజు, సునీల్ రామినేని, మమత మాడబతుల సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. 50 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమం, ఆన్లైన్ ద్వారా 1000కి మందికి పైగా వీక్షించారు. సిరివెన్నెల అభిమానులు షర్మిల, కృష్ణ కాంతి, మాధవి, ఫణీష్ తమ పాటలు, కవితలు వినింపించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమం చివర్లో ఆకెళ్ళ సిరివెన్నెల మాట్లాడుతూ వారికి వారి కుటుంభానికి సిరివెన్నలతో ఉన్న అనుబంధాన్ని తలుచుకున్నారు. తన అద్భుతమైన ప్రసంగంతో తండ్రికి తగ్గ తనయరాలిగా అందరి ప్రశంసలు పొందారు. కార్యక్రమంలో పాల్గొన అతిథులందరికీ విందు భోజన ఏర్పాట్లను రేణుక, అరుణ, శ్రీలలిత తదితరులు పర్యవేక్షించారు.

6.jpg4.jpg

ఈ కార్యక్రమమును మళ్ళి వీక్షించేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2024 | 05:52 PM