Share News

NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో 208వ సాహిత్య సదస్సు

ABN , Publish Date - Nov 18 , 2024 | 04:09 PM

208వ సాహిత్య సదస్సు నవంబర్ 24 (ఆదివారం) టెక్సాస్‌లోని లూయిస్ విల్ నగరంలో జరగనుంది. ఈ నెల తెలుగు భాషా సాహిత్యాలు- సమకాలీన సందిగ్ధ సమస్యలు అంశంపై సాహిత్య సదస్సు నిర్వహించనున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త ..

NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో 208వ సాహిత్య సదస్సు
Tantex

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) నెలనెలా తెలుగు వెన్నెల తెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 208వ సాహిత్య సదస్సు నవంబర్ 24 (ఆదివారం) టెక్సాస్‌లోని లూయిస్ విల్ నగరంలో జరగనుంది. ఈ నెల తెలుగు భాషా సాహిత్యాలు- సమకాలీన సందిగ్ధ సమస్యలు అంశంపై సాహిత్య సదస్సు నిర్వహించనున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త దయాకర్ మాడ తెలిపారు. సాహితీ బంధువులంతా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈనెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఆంగ్ల రచయిత ఆచార్య మధురాంతకం నరేంద్ర హాజరవుతారన్నారు. సాహితీ ప్రియులు వర్చువల్ విధానంలోనూ ఈ సదస్సులో భాగస్వాములు కావొచ్చని తెలిపారు. ఇప్పటివరకు 207 సాహిత్య సదస్సులు విజయవంతంగా పూర్తయ్యాయని, ప్రతి నెల ఒక్కో అతిథిని కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త దయాకర్ మాడ వెల్లడించారు.


ముఖ్య అతిథి గురించి..

మధురాంతకం నరేంద్ర ప్రముఖ తెలుగు, ఆంగ్ల రచయిత. ప్రముఖ కథకులైన మధురాంతకం రాజారాం కుమారుడు. తెలుగు సాహిత్యం, రచనలపై ఆయనకు ఉన్న మక్కువతో తన తండ్రి పేరు మీదుగా కథాకోకిల అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కొందరు రచయితలను సత్కరించడాన్ని అలవాటుగా చేసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పాకాల మండలం రమణయ్యగారి పల్లెలో 1959 జులైలో జన్మించారు. ఆయన తండ్రి రాజారాం స్వగ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ, రవీంద్రనాథ్ టాగూర్ కథలపై ఎంఫిల్, నయనతార సహగల్ రచనలపై పీహెచ్‌డీ చేశారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో ఆచార్యులుగా పనిచేశారు. ఆయన రచనలకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2022లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. విద్యార్థి దశలోనే ఆయన కథలు రాయడం మొదలుపెట్టారు. మధురాంతకం నరేంద్ర చిన్నతనం నుంచి రచనలపై మక్కువ పెంచుకున్నారు.


సాహితీ ప్రియులకు ఆహ్వానం

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో నిర్వహించే సాహిత్య సదస్సులో సాహితీ ప్రియులు పాల్గొనాలని సంస్థ అధ్యక్షులు బండారు సతీష్, పాలకమండలి అధ్యక్షులు సురేష్ మండువ , ఉత్తరాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, తక్షణ పూర్వధ్యక్షులు యర్రం శరత్ రెడ్డి, పాలకమండలి ఉపాధ్యక్షులు హరి సింగం, ఉపాధ్యక్షులు మాధవి లోకిరెడ్డి, కార్యవర్గ సభ్యులు లక్ష్మీ నరసింహ పోపూరి, నిడిగంటి గోవర్థనరావు, గుంట కిరణ్మయి, వేముల లెనిన్ బాబు ఓ ప్రకటనలో కోరారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 18 , 2024 | 04:50 PM