Share News

NRI: ఈ భారత సంతతి మహిళ నేరాలకు యూకే పోలీసులే షాక్!

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:51 PM

యూకేలో ఓ భారత సంతతి మహిళ ఖరీదైన షాపుల్లో సిబ్బందిని బురిడీ కొట్టించి ఏకంగా రూ.5 కోట్ల మేర దోచుకుంది. ఆమె నేరాలను చూసి ఏకంగా పోలీసులే షాకైపోయారు.

NRI: ఈ భారత సంతతి మహిళ నేరాలకు యూకే పోలీసులే షాక్!

ఇంటర్నెట్ డెస్క్: యూకేలో ఓ భారత సంతతి మహిళ (NRI) ఖరీదైన షాపుల్లో సిబ్బందిని బురిడీ కొట్టించి ఏకంగా రూ.5 కోట్ల మేర దోచుకుంది. ఆమె నేరాలను చూసి ఏకంగా పోలీసులే షాకైపోయారు. తన 40 ఏళ్ల కెరీర్‌లో అసలు పశ్చాత్తాపమే లేని క్రిమినల్‌ను తానెప్పుడూ చూడలేదని ఓ పోలీసు అధికారి మీడియాతో వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్‌, వేల్స్‌లో ఆమె చేసిన నేరాలకు గాను కోర్టు తాజాగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

NRI: ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆగస్టు 4న న్యూజెర్సీలో సమావేశం!


పూర్తి వివరాల్లోకి వెళితే, నిందితురాలు నరీందర్ కౌర్ 2015 మొదలు నాలుగేళ్ల వ్యవధిలో యావత్ బ్రిటన్‌లో రకరకాల మోసాలు చేసింది. ముఖ్యంగా ఖరీదైన షాపుల్లో వస్తువులను దొంగతనం చేసి వాటిని మళ్లీ అదే స్టోర్లకు తిరిగి అప్పగించి రిఫండ్ కోరేది. ఇందుకు కోసం ఆమె తక్కువ ఖరీదున్న వస్తువులు కొనుగోలు చేసి వాటి బిల్లులతో ఈ మోసాలకు పాల్పడేది. ఈ వ్యూహంతో ఆమె సోలీహల్, వార్సెస్టర్, షెల్టన్‌హామ్, మాల్వెర్న్, ష్రూస్‌బర్రీ, కార్డిఫ్, ట్రోబ్రిడ్జ్ వంటి ప్రముఖ స్టోర్లను మోసగించింది. అంతేకాకుండా, తన సొంత సోదరుడి సాయంతో అనేక లా సంస్థలను కూడా మోసగించింది. నాటకీయంగా తన సొంత తమ్ముడిపైనే కేసులు వేసేది. అతడు దొంగిలించిన క్రెడిట్ కార్డులతో ఆమెకు పరిహారం చెల్లించేవాడు.


2020లో ఆమె పోలీసులకు చిక్కినా పశ్చాత్తాపమనేదే లేకుండా మళ్లీ తన నేరాలను కొనసాగించింది. శిక్షల నుంచి తప్పించుకునేందుకు నకిలీ డాక్యుమెంట్లతో పోలీసులు, కోర్టులను బురిడీ కొట్టించేది. తన బ్యాంకు ఖాతాలను పోలీసులు బ్లాక్ చేసిన ప్రతిసారీ నకిలీ డాక్యుమెంట్లతో కొత్తవి తెరిచి మళ్లీ మోసాలకు పాల్పడేది. దాదాపు రూ.5 కోట్ల (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) మేర ఆమె మోసాలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. దర్యాప్తు సందర్భంగా విల్స్‌స్టైర్‌లోని ఆమె ఇంటి నుంచి రూ. కోటి విలువైన నగదు, ఇతర చోరీ చేసిన వస్తువులను సీజ్ చేశారు. 17 మారు పేర్లతో ఆమె ఈ మోసాలకు పాల్పడింది. నిందితురాలిపై మొత్తం 26 కేసులు దాఖలు చేశారు.

నరీందర్ కౌర్ పక్కా వ్యూహంతో ముందుకెళ్లేదని కేసును దర్యాప్తు చేసిన స్టీవ్ ట్రిస్ట్రామ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడిందని, ఆమెకు అసలేమాత్రం పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు. వివిధ దర్యాప్తు సంస్థలు, స్థానిక పోలీసులు, రిటైల్ షాపుల సంఘాలు కలిసి మహిళపై గట్టి నిఘాపెట్టి ఆటకట్టించామన్నారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Aug 02 , 2024 | 04:56 PM