భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు..
ABN, Publish Date - Nov 06 , 2024 | 12:13 PM
అమరావతి: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నాగులచవితి పండుగను ప్రజలు మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. భక్తులు వేకువ వజామునే లేచి పవిత్రస్నానాలను ఆచరించిన అనంతరం పొలాల్లో ఉన్న పుట్టల వద్దకు వెళ్లి పుట్టను పరిశుభ్రం చేసి, చుట్టూ ముగ్గులు వేసి, రంగురంగుల పువ్వులతో అందంగా అలంక రించారు. అనంతరం పుట్ట కలుగుల్లో పాలు, గుడ్లు, చలిమిడి, చిమ్నీ, వడపప్పు, పసుపు, కుంకుమలు వేసి పూజలు చేశారు. ఆపై పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, చిన్నారులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
Updated at - Nov 06 , 2024 | 12:13 PM