Viral: పాప్యులర్ రైల్వేస్టేషన్లలో లభించే ఈ ఫేమస్ ఫుడ్స్ గురించి తెలుసా?

ABN, Publish Date - Nov 25 , 2024 | 09:09 PM

దేశవ్యాప్తంగా ఉన్న పాప్యులర్ రైల్వే స్టేషన్లు, వాటిల్లో లభించే ఫేమస్ ఫుడ్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Viral: పాప్యులర్ రైల్వేస్టేషన్లలో లభించే ఈ ఫేమస్ ఫుడ్స్ గురించి తెలుసా? 1/9

దేశంలోని పురాతన, రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లలో హౌరా రైల్వే స్టేషన్ కూడా ఒకటి. కోల్‌కతాలోని ఈ స్టేషన్‌కు వెళ్లే అవకాశం వస్తే అక్కడ లభించే కథీ రోల్‌ను అస్సలు మిస్ కావొద్దు. అక్కడ లభించే పరాఠా రోల్స్ కూడా బాగా పాప్యులర్. అంతేకాకుండా, కీమా ఘుగ్నీ, పచ్కా, రాధా బొలోబీ వంటి వంటకాలను కచ్చితంగా ట్రై చేయాల్సిందే.

Viral: పాప్యులర్ రైల్వేస్టేషన్లలో లభించే ఈ ఫేమస్ ఫుడ్స్ గురించి తెలుసా? 2/9

ఇక ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినస్‌ కూడా దేశవ్యాప్తంగా పాప్యులర్. ఈ స్టేషన్‌కు యూనెస్కో ప్రపంచ వారతస్వ కట్టడం హోదా కూడా ఉంది. ఇక్కడ లభించే వడా పావ్‌ను క్రిస్పీ పచ్చిమిర్చితో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.

Viral: పాప్యులర్ రైల్వేస్టేషన్లలో లభించే ఈ ఫేమస్ ఫుడ్స్ గురించి తెలుసా? 3/9

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళితే అక్కడ ఉత్తరాది రుచులన్నీ టేస్టే చేయొచ్చు. అక్కడి ఆలూ చాట్ దేశవ్యాప్తంగా పాప్యులర్. దీంతో, పాటు ఛోలే బటోరే, పనీర్ పకోడీ, చట్నీతో కూడి న సమోసాలు, కేసర్ మిల్క్, లస్సీ లాంటి పానీయాలను టేస్టే చేసేందుకు జనాలు క్యూకడుతుంటారు.

Viral: పాప్యులర్ రైల్వేస్టేషన్లలో లభించే ఈ ఫేమస్ ఫుడ్స్ గురించి తెలుసా? 4/9

ఇది దక్షిణాదిన చెన్నై రైల్వే స్టేషన్‌ కూడా ఫుడ్స్ లవర్స్ మెప్పు పొందింది. ఇక్కడి ఇడ్లీలు, దోసలు దేశ్యాప్తంగా ఫేమస్. దీనితో పాటు ఫిల్టర్ కాఫీ, మేడు వడలు, పరవాన్నాలను కూడా జనాలు లొట్టలేసుకుంటూ తింటారు.

Viral: పాప్యులర్ రైల్వేస్టేషన్లలో లభించే ఈ ఫేమస్ ఫుడ్స్ గురించి తెలుసా? 5/9

ఆధ్యాత్మిక కేంద్రమైన పురాతన నగరం వారణాసిలోని వారణాసి రైల్వే స్టేషన్‌ కూడా ఘుమఘమలాడే ఫుడ్స్‌కు పాప్యులర్. ఇక్కడకు వెళ్లిన ప్రతి ఒక్కరూ పూరీ ఆలూ, టమాటా చాట్, దహీ భల్లా బటర్ సుగర్ టోస్టు, బనారసీ పానీపురీలను ట్రై చేయాలి. వీటితో పాటు కచోరీ, లస్సీ, చాట్, రబ్రీలను కూడా మిస్ చేయొద్దు

Viral: పాప్యులర్ రైల్వేస్టేషన్లలో లభించే ఈ ఫేమస్ ఫుడ్స్ గురించి తెలుసా? 6/9

తేయాకు తోటలకు పేరుగాంచిన అస్సామ్‌లో ఉత్పత్తి అయ్యే వివిధ రకాల టీ ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్. ఇక్కడి గువహాటీ రైల్వే స్టేషన్లలో లభించే లాల్ చాయ్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. బ్లాక్ టీకి వివిధ సుగంధ ద్రవ్యాలు, చక్కెర, నిమ్మరసం కలిపి చేసే ఈ టీ అద్భుతంగా ఉంటుంది. దీంతో, పాటు లూచీ, థుప్కా, ఖార్, చికెన్ కర్రీ, అస్సామీస్ థాలీ వంటివి కచ్చితంగా ట్రై చేయాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

Viral: పాప్యులర్ రైల్వేస్టేషన్లలో లభించే ఈ ఫేమస్ ఫుడ్స్ గురించి తెలుసా? 7/9

ఇక పట్నా రైల్వే స్టేషన్‌లో లభించే బీహారీ వంటకం లిట్టీ ఛోకా కూడా భోజన ప్రియులకు ఫేవరెట్ ఫుడ్. గోధుమ పిండి, శనగ పిండి, టమాటాలు, వెల్లుల్లితో చేసే ఈ వంటకాన్ని స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా తెగ ఎంజాయ్ చేస్తారు.

Viral: పాప్యులర్ రైల్వేస్టేషన్లలో లభించే ఈ ఫేమస్ ఫుడ్స్ గురించి తెలుసా? 8/9

ఇక మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారు కచ్చితంగా ట్రై చేయాల్సిన వంటకం కాందా పోహా. అటుకులతో చేసే ఈ వంటకాన్ని సాధారణంగా ఉదయం అల్పాహారంగా భుజిస్తారు. ఈ వంటకం కూడా దేశవ్యాప్తంగా పాప్యులర్

Viral: పాప్యులర్ రైల్వేస్టేషన్లలో లభించే ఈ ఫేమస్ ఫుడ్స్ గురించి తెలుసా? 9/9

ఆజ్మేర్ రైల్వే స్టేషన్‌లో లభించే కఢీ కచోరీ, దహీ కఢీ, కరకరాలడే కచోరీ వంటివి కూడా పాప్యులర్. అజ్మేర్‌కు వెళ్లేవారు వీటిని అస్సలు మిస్ కాకూడదు. ఇక్కడ దొరికే ప్యాస్ కచోరీ, సమోసా, గట్టేకీ సబ్జీ, లాల్ మాస్, వంటివన్నీ రాజస్థాన్ రుచులకు ప్రతీకలుగా నిలుస్తాయి.

Updated at - Nov 25 , 2024 | 09:15 PM