Home » Indian Railways
రైలు ప్రయాణికులకు చిన్న శుభవార్త వచ్చింది. ప్యాసింజర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సూపర్ యాప్‌ను డిసెంబర్ 2024 చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేస్ యోచిస్తోంది. ప్రస్తుత ఐఆర్సీటీసీ ప్లాట్‌ఫారమ్‌కు ఈ యాప్ భిన్నంగా ఉండనుంది.
రైళ్లలో ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీని ఉపయోగిస్తున్నారు. పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్ తెలుసుకొనేందుకు వేర్వేరు యాప్‌లు వినియోగించాలి. ఆ కష్టాలకు చెక్ పెడుతూ ఐఆర్సీటీసీ ఓ కొత్త సూపర్ యాప్‌ను తీసుకొస్తోంది.
భారతీయ రైల్వే రిజర్వేషన్లకు సంబంధించి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. ఈరోజు నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు రైలు ప్రయాణం తేదీకి 120 రోజుల ముందు టికెట్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. ఈరోజు (1 నవంబర్ 2024)నుంచి ఈ విధానంలో మార్పులు చేసింది. 120 రోజులు ఉన్న గడువును 60 రోజులకు..
పండగ వేళ దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేస్ ఈ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకులను సురక్షితంగా, సకాలంలో వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ ట్రైన్స్ నడపనున్నట్టు పేర్కొంది
భారతీయ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ఐసీఎఫ్ నీలి రంగు బోగీలు ఉంటాయట. రాజధాని వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లల్లో ఎల్‌హెచ్‌బీ బోగీలు వినియోగిస్తారని నిపుణులు చెబుతారు.
బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణాలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవే. అందుకే సామాన్యులు రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే చాలామంది ప్రయాణీకులకు ఆహారానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. పరిశుభ్రత ప్రమాణాలు సరిగా లేకపోవడంతో రైల్వే స్టేషన్లలో దొరికే ఫుడ్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ఇందుకు ఓ చక్కటి పరిష్కారం మార్గం ఉంది.
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర ప్రమాదం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముంబయి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు.
శంలో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యచరణను ప్రారంభించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. శంషాబాద్-విశాఖపట్టణం..
దానా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. 25న ఈ తీవ్ర తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ అప్రమత్తమైంది. 150కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఒంటరిగా రైల్వే ట్రాక్‌పై నడిచి వెళ్లాలంటే భయం. రైలు.. మధ్యలో ఆగితే కిందకు దిగాలంటే భయం. ఇదేదో సాధారణమైన, చిన్న రైల్వేస్టేషన్ దగ్గర పరిస్థితో కాదు. దేశంలోనే ఏ1 రైల్వేస్టేషన్‌గా పేరొందిన విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద దుస్థితి. స్టేషన్ లోపలే కాదు.. బయటకు వెళ్లాలన్నా ఈ భయం వెంటాడుతోంది. ఆకతాయిలు, గంజాయి బ్యాచ్ సంచారం దడ పుట్టిస్తుంటే.. ఇటీవల జరిగిన లోకో పైలెట్ హత్య మరింత ఆందోళనలోకి నెట్టింది.