Share News

Cyclone Dana: దానా తుపాను ఎఫెక్ట్.. 150కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు.. వివరాలు ఇవే

ABN , Publish Date - Oct 22 , 2024 | 09:54 PM

దానా తుపాను ముప్పు ముంచుకొస్తోంది. 25న ఈ తీవ్ర తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ అప్రమత్తమైంది. 150కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Cyclone Dana: దానా తుపాను ఎఫెక్ట్.. 150కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు.. వివరాలు ఇవే

‘దానా’ తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ప్రయాణీకుల భద్రత నిమిత్తం 150కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. రద్దు చేసిన రైళ్లన్నీ అక్టోబర్ 23 నుంచి 25 తేదీల మధ్య ఆగ్నేయ రైల్వే (సౌత్ ఈస్టర్న్ రైల్వే) పరిధిలో నడవనున్నాయని వివరించింది. రద్దైన రైళ్ల జాబితాలో హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, కామాఖ్య-యశ్వంత్‌పూర్ ఏసీ ఎక్స్‌ప్రెస్, హౌరా-పూరీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, హౌరా-భువనేశ్వర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లు ఉన్నాయి. పరిస్థితి ప్రతికూలంగా ఉంటే మరికొన్ని రైళ్లను కూడా రద్దు చేసే అవకాశం ఉంటుందని ఆగ్నేయ రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. కాగా కోల్‌కతా ప్రధాన కేంద్రంగా పనిచేసే ఆగ్నేయ రైల్వే.. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలలో విస్తరించి ఉంది.


కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన తూర్పు రైల్వే

దానా తుపాను నేపథ్యంలో అక్టోబర్ 24 నుంచి 25 వరకు ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసినట్టు తూర్పు రైల్వే ప్రకటించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. అది కాస్త తీవ్రమైన ‘దానా తుపాను’గా మారింది. ఈ తుపాను అక్టోబర్ 25 తెల్లవారుజామున పూరీ- సాగర్ ద్వీపం మధ్య ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకనుంది. తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. గరిష్ఠంగా గంటకు 110 - 120 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీస్తుయని హెచ్చరించింది.


కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ అలర్ట్..

మరోవైపు దానా తుపాను తీవ్రమైనది కావడంతో కోల్‌కతా విమానాశ్రయం అధికారులు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తుపాను కారణంగా ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు సీనియర్ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. విమానాశ్రయంలో మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రామాణికమైన నిర్వహణ విధానాలు అన్నింటినీ నిర్వహిస్తున్నట్లు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ డాక్టర్ ప్రవత్ రంజన్ బ్యూరియా తెలిపారు.


ఇవి కూడా చదవండి

శబరిమల యాత్రకు ప్రత్యేక రైలు

సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ఏఐ వినియోగంలో జర జాగ్రత్త

For more National News and Business News and Telugu News

Updated Date - Oct 22 , 2024 | 10:02 PM