Share News

AP Elections: ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన టీడీపీ మహిళా నేత!

ABN , Publish Date - Apr 01 , 2024 | 04:56 PM

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Assembly Elections ) టికెట్ల లొల్కికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. అసంతుష్టులను బుజ్జగించడానికి అధినేతలు, అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించట్లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. టికెట్లు దక్కని వారు ఇండిపెండెంట్‌లుగా పోటీచేస్తామని ప్రకటించడమా..? లేకుంటే పార్టీకి గుడ్ బై చెప్పేసి ఏదోక కండువా కప్పేసుకోవడమా..? లాంటివి చేస్తున్నారు..

AP Elections: ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన టీడీపీ మహిళా నేత!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Assembly Elections ) టికెట్ల లొల్కికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. అసంతుష్టులను బుజ్జగించడానికి అధినేతలు, అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించట్లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. టికెట్లు దక్కని వారు ఇండిపెండెంట్‌లుగా పోటీచేస్తామని ప్రకటించడమా..? లేకుంటే పార్టీకి గుడ్ బై చెప్పేసి ఏదోక కండువా కప్పేసుకోవడమా..? లాంటివి చేస్తున్నారు. దీంతో ఒకటికి రెండుసార్లు పిలిపించి మరీ బుజ్జగిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక తప్పకుండా మీ త్యాగాన్ని గుర్తించి.. ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడంతో కొందరు మాత్రం తగ్గి.. పార్టీలో కంటిన్యూ అవుతూ వస్తున్నారు. మరికొందరు బుజ్జగింపులకు ఏ మాత్రం తగ్గకుండా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

వరంగల్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్


Meesala-Geetha.jpg

ఎవరా మహిళా నేత!

ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ (Telugu Desam) మహిళా నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత (Meesala Geetha) టికెట్ రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2019 లో టికెట్ రాకపోవడం.. ఈసారైనా తన సేవలు గుర్తించి పార్టీ టికెట్ ఇస్తుందని భావించినప్పటికీ అదీ జరగలేదు. విజయనగరం టికెట్ ఆశించి భంగపడిన గీత.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడానికి సిద్ధమయ్యారు. నియోజకవర్గంలోని కొండకరకాం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు ప్రచారం కూడా ప్రారంభించారు. కొన్నేళ్లుగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు వ్యతిరేకంగా నగరంలో కార్యాలయం ప్రారంభించి, రాజకీయ కార్యకలాపాలను గీత కొనసాగిస్తున్నారు. విజయనగరం స్థానం నుంచి కాకపోయినా.. ఏదో ఒక స్థానం నుంచి అయినా టీడీపీ బీఫామ్‌తో పోటీ చేయాలని గీత ఆశపడ్డారు. అయితే.. గీతను ఎందుకో అధిష్టానం పక్కనపెట్టింది.


ఏం జరుగుతుందో..?

వాస్తవానికి.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమితో పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే.. టికెట్ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో రాలేదో తెలుసుకుని శాంతించగా.. మరికొందరు మాత్రం ఇలా ఇండిపెండెంట్‌లుగా పోటీచేయడానికి సిద్ధమవుతున్నారు. గీత విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు.. అనంతపురం అర్బన్ నుంచి ప్రభాకర్ చౌదరి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి రెడీ అయ్యారు. మరోవైపు.. అనపర్తి టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న నలిమిల్లి రామకృష్ణారెడ్డిని.. చంద్రబాబు పిలిపించి బుజ్జగించగా కాస్త కూల్ అయినట్లు తెలుస్తోంది. ఒక్క టీడీపీలోనే కాదు.. అధికార వైసీపీ, జనసేన, బీజేపీలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఈ అసంతృప్తులను టీడీపీ అధిష్టానం ఎలా సెట్ రైట్ చేస్తుందో ఏంటో చూడాలి మరి.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి


Updated Date - Apr 01 , 2024 | 10:24 PM