Share News

AP Elections 2024: మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన గెలుస్తారా..!?

ABN , Publish Date - May 20 , 2024 | 12:47 PM

ఏపీలో ఎన్నికలు (AP Elections) అయిపోయాయి.. లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది.! మరో 15 రోజుల్లో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు అనేది తేలిపోనుంది.! అయినా ఫలితాలపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5 నియోజకవర్గాలది ఒక ఎత్తు.. రాజమహేంద్రవరం రూరల్‌, గోపాలపురం నియోజకవర్గాలది మరో ఎత్తు.. ఇక్కడి నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇద్దరు మంత్రులు పోటీపడ్డారు...

AP Elections 2024: మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన గెలుస్తారా..!?

  • మంత్రుల స్థానాలపై తీవ్ర చర్చ

  • ఎన్నికల ముందు ఇద్దరూ బదిలీ

  • వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ

  • గోపాలపురం నుంచి వనిత

  • రాజమండ్రి రూరల్‌ నుంచి వేణు

  • హోరాహోరీగా సాగిన పోరు

  • మరో 15 రోజుల్లో ఫలితాలు

  • కూటమి అభ్యర్థులకు మొగ్గు

  • వైసీపీ మేకపోతు గాంభీర్యం

ఏపీలో ఎన్నికలు (AP Elections) అయిపోయాయి.. లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది.! మరో 15 రోజుల్లో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు అనేది తేలిపోనుంది.! అయినా ఫలితాలపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5 నియోజకవర్గాలది ఒక ఎత్తు.. రాజమహేంద్రవరం రూరల్‌, గోపాలపురం నియోజకవర్గాలది మరో ఎత్తు.. ఇక్కడి నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇద్దరు మంత్రులు పోటీపడ్డారు. ఈ ఇద్దరూ బదిలీపై వచ్చి గతంలో ఉన్న స్థానాల్లో కాకుండా వేరొక స్థానాల్లో పోటీపడడం విశేషం. దీంతో పోలింగ్‌ తర్వాత జిల్లాలోని ఇద్దరు మంత్రుల గెలుపోటములపై ప్రజల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. వైసీపీకి (YSR Congress) వ్యతిరేకంగా ఓ సైలెంట్‌ వేవ్‌ ఉందని అందరూ కోడై కూస్తుంటే.. వైసీపీలో కొందరు ఓ పక్క ఓడిపోతామనే భయమున్నా.. మరో పక్క మహిళ ఓట్లన్నీ తమకే పడ్డాయి అనుకుంటూ బలవంతంగా తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన వేణు రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన గత ఎన్నికల్లో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచి.. బీసీల్లోని శెట్టిబలిజ కోటా కింద మంత్రి అయ్యారు. మూడు శాఖలు నిర్వహించారు. కానీ పవరంతా సీఎం జగన్‌ చేతిలో ఉండి పోవడంతో ఈ మూడు శాఖల ద్వారా ఆయన పెద్దగా గుర్తింపు పొందిందేమీ లేదు. ఎన్నికల ముందు జగన్‌ ఆయనను బలవంతంగా రామచంద్రపురం నుంచి బదిలీ చేసి రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి పోటీ చేయించిన సంగతి తెలిసిందే.

Kodali Nani: ఎన్నికల తర్వాత కొడాలి నాని తీవ్ర ఆవేదన..!



Taneti-Vanitha.jpg

వనితను విజయం వరిస్తుందా..?

తానేటి వనిత గత ఎన్నికల్లో కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచి ఐదేళ్ల పాటు మంత్రి ఉన్న సంగతి తెలిసిందే. ఆమె మొదట మహిళా శిశుసంక్షేమ శాఖ, ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా ఉన్నారు.ఆమెకు ఈ శాఖలు అదనంగా తెచ్చిన పలుకుబడీ ఏమీ లేదు. కానీ హోంమంత్రిగా సొంత నియోజకవర్గంలో బ్యాడ్‌ అయ్యారు. పైగా అక్కడ ఓ ముఖ్యవర్గాన్ని దూరంపెట్టే ప్రయత్నం చేయడంతో ఏకంగా ఆమె స్థానమే మారాల్సి వచ్చింది. జగన్‌ ఆమెను కూడా బదిలీ చేసి గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత వీరిద్దరూ గెలుస్తారా? ఓడిపోతారా..? అనేది పెద్ద చర్చనీయాంశమైంది. గోపాలపురం నియోజకవర్గంలో మొత్తం 2,42,763 ఓటర్లు ఉండగా 2,10,399 మంది ఓటేశారు. ఇది 86.67 శాతం. ఇందులో మహిళలు 1,23,793 మంది ఉండగా 1,05,564 మంది ఓటేశారు. పురుషులు 1,18,965 మంది ఉండగా 1,04,831 మంది ఓటేశారు. ఉదయం నుంచి ఓటర్లు పొలోమంటూ రావడంతో కూటమి వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజుకే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయనే అంచనా ఉంది. దీనిపై జూన్‌ 4వ తేదీన స్పష్టత రాబోతోంది.

Chelluboyina-venugopal.jpg

‘చెల్లు’తారా..?

ఇక రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి పోటీ చేసిన మంత్రి చెల్లుబోయిన వేణుకు కూడా కష్టకాలమనే అంచనాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఎపుడూ టీడీపీకి కంచుకోట. నియోజకవర్గంలో మొత్తం 2,72,826 మంది ఓటర్లు ఉండగా 1,99,220 మంది ఓటేశారు. ఇది 73.02 శాతం. ఇక్కడ 1,33,241 మంది పురుష ఓటర్లు ఉండగా 97,530 మంది ఓటేశారు.1,39,561 మంది మహిళా ఓటర్లు ఉండగా 1,01,673 మంది ఓటేశారు. ఇక్కడ రెండుసార్లు విజయఢంకా మోగించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో వేణు తలపడ్డారు. గోరంట్లకు అభిమాన ఓటర్లు ఉన్నారు. పైగా జనసేన, బీజేపీ ఓట్లన్నీ కలిసొచ్చాయి. దీంతో గోరంట్లదే గెలుపు అనే ప్రచారం జరుగుతోంది. ఇలా జగన్‌ బదిలీ చేసిన ఇద్దరు మంత్రులకు చుక్కెదురవుతుందని అంచనా.

GORANTLA.jpg

Read more TS News and Telugu News

Updated Date - May 20 , 2024 | 12:49 PM