Share News

AP Politics: బీజేపీకి టచ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి.. ఎమ్మెల్యే సంచలనం!

ABN , Publish Date - Jun 21 , 2024 | 03:20 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలైన తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 సీట్లకు పరిమితం కావడం.. ఇక 25 ఎంపీ స్థానాల్లో కేవలం 04 స్థానాల్లోనే గెలవడంతో పార్టీకి గడ్డు పరిస్థితులు వచ్చినట్లయ్యింది...

AP Politics: బీజేపీకి టచ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి.. ఎమ్మెల్యే సంచలనం!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలైన తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 సీట్లకు పరిమితం కావడం.. ఇక 25 ఎంపీ స్థానాల్లో కేవలం 04 స్థానాల్లోనే గెలవడంతో పార్టీకి గడ్డు పరిస్థితులు వచ్చినట్లయ్యింది. దీంతో ఆ 11 మంది.. ఈ నలుగురు ఎప్పుడు ఏ గూటికి చేరిపోతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వైసీపీని టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియట్లేదు కానీ అంతా సైలెంట్ అయిపోయింది. ఇక ఎంపీలు అయితే ఇద్దరు పక్కాగా బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల సంగతేమో కానీ.. వైసీపీ యంగ్ ఎంపీ, వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) అత్యంత సన్నిహితుడు బీజేపీలో చేరడానికి రెడీ అయినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే సంచలనానికి తెరదీశారు.

తొలిసారి సీబీఎన్-పవన్ భేటీ.. సరదా సంభాషణ!


Adi-Narayana-Reddy.jpg

అసలేం జరుగుతోంది..?

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (PV Mithun Reddy) వైసీపీ కండువా తీసేసి కాషాయ కండువా కప్పుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారట. బీజేపీకి టచ్‌లోకి వెళ్లారన్న విషయాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియా వేదికగా బయటపెట్టారు. శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన బీజేపీ ఎమ్మెల్యే అనంతరం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేందుకు మిథున్‌రెడ్డి అగ్ర నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లారు. వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. స్వయంగా మిథున్ రెడ్డి బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారు. కానీ బీజేపీ నాయకత్వం అక్కర్లేదని అంటోంది. కానీ మేం చేరతామంటూ మిథున్ ఇంకా లాబీయింగ్ నడుపుతున్నారు. నాతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా మిథున్ ఒత్తిడి తెస్తున్నారు అని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు.

సాధారణ సభ్యుడిగానే వైఎస్ జగన్ ప్రమాణం


PV-Mithun-Reddy.jpg

బీజేపీలోకి ఎందుకు..?

పెద్దిరెడ్డి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో చాలా చోట్ల వ్యాపారాలు ఉన్నాయి. అంతేకాదు.. ఆఫ్రికాలో కూడా వ్యాపారాలు నడుస్తున్నాయని ఈ మధ్యనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. రేపొద్దున్న వ్యాపార రంగంలో ఇబ్బందులు తప్పవని.. ఇందుకు అధికారంలో ఉన్న ఏదో ఒక పార్టీ అండ కావాలన్నది మిథున్ రెడ్డి ప్లానట. అందుకే బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్‌లోకి వెళ్లారని.. కమలనాథులు వద్దంటున్నా సరే ప్రయత్నాలు ఆపట్లేదన్నది తాజాగా ఆదినారాయణ రెడ్డి చెప్పడంతో వెలుగుచూసింది. వాస్తవానికి.. ఎన్నికల ఫలితాల మరుసటి రోజు నుంచే మిథున్ ఎక్కడా కనిపించలేదు.. ఆయన వాయిస్ కూడా మీడియాలో వినిపించలేదు. అప్పట్నుంచే బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరగ్గా.. ఇప్పడు ఆదినారాయణ మాటలతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇంతవరకూ ఈ వార్తలను కనీసం ఖండించని ఎంపీ.. వీటిని నిజం చేస్తారో..? లేకుంటే వైసీపీలోనే కొనసాగుతారో చూడాలి. అయితే వైఎస్ జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో పార్టీలో కొనసాగుతారని.. వైసీపీని వీడే ప్రసక్తే లేదని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఫైనల్‌గా మిథున్ మనసులో ఏముందో తెలియాలంటే మీడియా ముందుకు వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..


Updated Date - Jun 21 , 2024 | 03:25 PM