Share News

Train Journey: ట్రైన్‌లో కన్ఫర్మ్ టికెట్ కావాలంటే ఇలా చేయండి.. లేట్‌గా చేసుకున్నా మీకు బెర్త్ గ్యారంటీ..

ABN , Publish Date - Sep 30 , 2024 | 03:10 PM

రైలు టికెట్లు చూస్తే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది. దీంతో రైలు ప్రయాణం కష్టమని భావిస్తారు. కానీ కొన్ని రైళ్లలో మనం వెళ్లాల్సిన ప్రాంతాలకు టికెట్ చూస్తే వెయిటింగ్ లిస్ట్ ఉండొచ్చు. కానీ అదే రైలులో కొన్ని ప్రాంతాలకు కన్ఫర్మ్ టికెట్లు ఉంటాయి. సాధారణంగా భారతీయ రైల్వే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి..

Train Journey: ట్రైన్‌లో కన్ఫర్మ్ టికెట్ కావాలంటే ఇలా చేయండి.. లేట్‌గా చేసుకున్నా మీకు బెర్త్ గ్యారంటీ..
Rail Journey

దూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణం చేయడానికి పేద, మధ్య తరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. బస్సు ప్రయాణంతో పోలిస్తే రైలు ప్రయాణానికి తక్కువ వ్యయం కావడంతో పాటు తొందరగా గమ్య స్థానాన్ని చేరుకోవచ్చు. అంతేకాదు బస్సుతో పోలిస్తే రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ముందుగా జర్నీ ప్లాన్ చేసుకుంటే టికెట్లు ఓపెన్ కాగానే చేసుకుంటుంటారు. కొందరు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో రైలు టికెట్లు చూస్తే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది. దీంతో రైలు ప్రయాణం కష్టమని భావిస్తారు. కానీ కొన్ని రైళ్లలో మనం వెళ్లాల్సిన ప్రాంతాలకు టికెట్ చూస్తే వెయిటింగ్ లిస్ట్ ఉండొచ్చు. కానీ అదే రైలులో కొన్ని ప్రాంతాలకు కన్ఫర్మ్ టికెట్లు ఉంటాయి. సాధారణంగా భారతీయ రైల్వే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైలు నడిపేటప్పుడు ఆ మార్గంలో ప్రధాన జంక్షన్ల కోసం కొన్ని టికెట్లను రిజర్వ్ చేస్తుంది. ఆ టికెట్లు నిర్దేశించిన ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి టికెట్ చేసుకునేటప్పుడు మాత్రమే కన్ఫర్మ్ అవుతాయి. రైలు ప్రారంభం నుంచి గమ్య స్థానం వరకు ఎక్కువ టికెట్లను అందుబాటులో ఉంచుతుంది. అదే మధ్యలోని ప్రాంతాల నుంచి టికెట్ చేసుకుంటే తక్కువ టికెట్లు అందుబాటులో ఉంటాయి. దీంతో మనం వెళ్లాల్సిన ప్రదేశాలకు టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. అలా కాకుండా మనకు కన్ఫర్మ్ టికెట్లు కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

Tourism: తక్కువ ధరలో ప్రముఖ దేవాలయాలకు.. ఈ టూర్ ప్యాకేజీ బెస్ట్


ఇలా చేస్తే బెర్త్ దొరికే ఛాన్స్..

ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లాలనుకుంటే నాలుగు నుంచి ఐదు రెగ్యులర్ ట్రైన్‌లు అందుబాటులో ఉన్నాయి. కొణార్క్ ఎక్స్‌ప్రెస్, విశాఖ, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌కోస్ట్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొణార్క్ ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి భువనేశ్వర్ వరకు వెళ్తుంది. ఈ రైలులో సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు టికెట్ చూస్తే ఎక్కువుగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది.అదే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు టికెట్ బుక్ చేసుకుంటే ఎక్కువుగా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే ట్రైన్‌లో విశాఖపట్టణం నుంచి శ్రీకాకుళానికి వేరుగా టికెట్ బుక్ చేసుకుంటే రెండు టికెట్లు కన్ఫర్మ్ టికెట్లు లభించే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి.

Tour Plans:దసరా సెలవులకు లాంగ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఇవైతే బెస్ట్


ఉదాహరణకు అక్టోబర్ 20 నుంచి 25 వరకు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళానికి వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. అవే తేదీల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖ, విశాఖపట్టణం నుంచి శ్రీకాకుళానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళానికి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో డైరెక్ట్ టికెట్ స్లీపర్ క్లాస్ 425 రూపాయిలు కాగా.. విశాఖపట్టణం వరకు ఒకటి, అక్కడి నుంచి శ్రీకాకుళానికి మరో టికెట్ చేసుకోవడం ద్వారా వంద రూపాయిలు ఎక్స్‌ట్రా ఖర్చవుతుంది. అంటే రెండు టికెట్లకు రూ.525 రూపాయిలు అవుతుంది. వంద రూపాయిలు ఎక్కవైనా కన్ఫర్మ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కేవలం ఈ ఒక్క ట్రైన్ మాత్రమే కాకుండా ప్రతి రైలులోనూ ఈ విధానం అందుబాటులో ఉంటుంది.

Viral: రాత్రి 2.00 గంటలకు బాస్ నుంచి ఊహించని మెసేజ్! మహిళకు షాక్!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 30 , 2024 | 03:10 PM