Lucknow: కన్యాదానం అవసరం లేదు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 08 , 2024 | 03:03 PM
హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహానికి 'కన్యాదానం' అవసరం లేదని 'సప్తపది' మాత్రమే ముఖ్యమైన వేడుక అని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. అశుతోష్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
లక్నో: హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహానికి 'కన్యాదానం' అవసరం లేదని 'సప్తపది' మాత్రమే ముఖ్యమైన వేడుక అని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) పేర్కొంది. అశుతోష్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Delhi: బెంగాల్‌లో గెలిచే పార్టీ అదే.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన అంచనాలు
హిందూ చట్టం ప్రకారం వివాహంలో కన్యాదానం అవసరమని, ఆ కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహించలేదని పిటిషనర్ వాదించారు. ఈ కేసులో మార్చి 22న అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హిందూ వివాహ చట్టం ప్రకారం సప్తపది(ఏడు అడుగులు నడవడం) కీలకమని కోర్టు తెలిపింది. "కన్యాదాన్ వేడుక జరిగిందా లేదా అనేది కేసు న్యాయమైన నిర్ణయానికి అవసరం లేదు.
కాబట్టి ఈ వాస్తవాన్ని రుజువు చేయడానికి సెక్షన్ 311 CrPC కింద సాక్ష్యులకు సమన్లు జారీ చేయలేం" అని కోర్టు చెప్పింది. హిందూ వివాహ చట్టం ప్రకారం సప్తపది కీలకమని కోర్టు తెలిపింది. మొత్తం పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, హిందూ వివాహానికి కన్యాదాన్ అవసరం లేదని కోర్టు పేర్కొంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి