Share News

Mid Air flight: భార్య భర్తలు డిష్యూం డిష్యూం.. విమానం అత్యవసర ల్యాండింగ్

ABN , Publish Date - Aug 01 , 2024 | 03:21 PM

భార్యాభర్తల మధ్య బంధం కాసింత కోపాలు, మరికాసింత తాపాలు అన్నట్లుగానే ఉండాలి. భార్య ఆగ్రహం ప్రదర్శిస్తే.. భర్త తగ్గి ఉండాలి. భర్త ఆలిగితే.. భార్య బుజ్జగించేలా ఉండాలి. అలా ఉంటేనే దాంపత్య జీవితం సాఫీగా సాగి పోతుంది. కానీ నేటి తరానికి చెందిన యువతి యువకుల్లో దాంపత్య జీవితం తాలుక మధురిమలు ఏ మాత్రం తెలియడం లేదు.

Mid Air flight: భార్య భర్తలు డిష్యూం డిష్యూం.. విమానం అత్యవసర ల్యాండింగ్

భార్యాభర్తల మధ్య బంధం కాసింత కోపాలు, మరికాసింత తాపాలు అన్నట్లుగానే ఉండాలి. భార్య ఆగ్రహం ప్రదర్శిస్తే.. భర్త తగ్గి ఉండాలి. భర్త ఆలిగితే.. భార్య బుజ్జగించేలా ఉండాలి. అలా ఉంటేనే దాంపత్య జీవితం సాఫీగా సాగి పోతుంది. కానీ నేటి తరానికి చెందిన యువతి యువకుల్లో దాంపత్య జీవితం తాలుక మధురిమలు ఏ మాత్రం తెలియడం లేదు. పెళ్లంటే.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసి నూరేళ్ల అన్నట్లుగా ఉండడం లేదు. చిన్న చిన్న విషయాలను గోరంతలు కొండతలుగా భూతద్దంలో చూసుకుని.. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లిపోతున్నారు. దాంతో గుట్టుగా సాగాల్సిన కాపురాలు కాస్తా నడి బజారులో రట్టు చేసుకుంటున్నారు.

Maharashtra Assembly Elections 2024: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం

Also Read: Viral Video: కొత్త పార్లమెంట్ భవనంలో వర్షం లీక్.. స్పందించిన ప్రతిపక్షాలు


అందుకు సంబంధించిన ఓ వైనం ఇటీవల విమానంలో చోటు చేసుకుంది. డబ్లిన్ నుండి స్పెయిన్‌లోని పాల్మా డి మల్లోర్కాకు విమానం బయలు దేరింది. ఆ విమానంలో ఓ దంపతుల మధ్య మాటామాట పెరిగింది. అది కాస్తా ఘర్షణగా మారింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన విమానంలోని సిబ్బంది వారిని శాంతింప చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో.. ఈ విషయాన్ని డబ్లిన్‌లోని ఏటీసీకి తెలిపారు. దాంతో నాంటెన్ విమానాశ్రయ అధికారులతో మాట్లాడి.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయించేలా చూశారు.

Also Read: RajyaSabha: రాజ్యసభలో ‘నమో నగర్’ కోసం ప్రైవేట్ బిల్లు

Also Read: సీఎం చంద్రబాబుకు మంద కృష్ణ మాదిగ ధన్యవాదాలు

Also Read: Wayanad Landslide: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక


అనంతరం దంపతుల్లో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భార్య అప్పటికే తీవ్ర గాయాలంతో ఉంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలిచారు. అనంతరం అంటే.. దాదాపు రెండు గంటల అనంతరం సదరు విమానంన స్పెయిన్‌లోని పాల్మా డి మల్లోర్కాకు చేరుకుంది. అయితే ఈ ఘటనపై సహచర విమాన ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునారావృతం కాకుండా విమాన సిబ్బంది వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Also Read: Himachal Pradesh: భారీ వర్షాలు.. ఒకరు మృతి, 32 మంది గల్లంతు

Also Read: ChandraBabu Govt: ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై వేటు!

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 01 , 2024 | 03:21 PM