Share News

omega-3: మొటిమలను నయం చేసే జలపుష్పాలు..

ABN , Publish Date - Jul 29 , 2024 | 11:57 AM

జలపుష్పాలు.. అదేనండి చేపలు. అవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. అయితే చేపలు తినడం వల్ల మొటిమలు తగ్గుతాయని తాజా పరిశోధనలో వెల్లడయింది. ఒమేగా 3 అమ్లాలు దండగా ఉండే సాల్మన్, సార్‌డైన్స్ వంటి చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల మొటిమల నివారణకే కాదు.. అవి త్వరతిగతిన తగ్గేలా చేస్తుందని బహిర్గతమైంది.

omega-3: మొటిమలను నయం చేసే జలపుష్పాలు..

జలపుష్పాలు.. అదేనండి చేపలు. అవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. అయితే చేపలు తినడం వల్ల మొటిమలు తగ్గుతాయని తాజా పరిశోధనలో వెల్లడయింది. ఒమేగా 3 అమ్లాలు దండగా ఉండే సాల్మన్, సార్‌డైన్స్ వంటి చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల మొటిమల నివారణకే కాదు.. అవి త్వరతిగతిన తగ్గేలా చేస్తుందని బహిర్గతమైంది. స్వల్పంగా మొటిమలు ఉన్నా వారిని పరిశోధకులు ప్రశ్నించగా.. వీరిలో 98 శాతం మందిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మోతాదు తక్కువగా ఉన్నట్లు తెలింది.


fishing.jpg

అయితే వీరికి కోవ్వు అమ్లాలు అధికంగా ఉండే అహారంతోపాటు అందుకు సంబంధించిన మాత్రలు ఇవ్వడంతో.. వారిలో మంచి ఫలితాలు స్పష్టంగా ఆగుపించినట్లు పేర్కొంటున్నారు. ఇక ఒమేగా 3 కొవ్వు అమ్లాలు తీసుకోవడం వల్ల ఒంట్లోని వాపును సైతం తగ్గిస్తుంది. అలాగే చర్మంలో నూనె ఉత్పత్తిని కూడా నియంత్రిస్తుంది. వాపు ప్రక్రియను ప్రేరేపించే రసాయనాలను నియంత్రించడం ద్వారా మొటిమలు తగ్గేలా చేస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.


ఇక ఈ పరిశోధనలపై పలువురు సందేహాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం, పాల పదార్ధాలు తగ్గించడం, ఒమేగా 3 మాత్రలు, ఇతర పద్దతుల్లో ఏవీ ప్రభావం చూపిస్తున్నాయో తెలియడం లేదని వారు అంటున్నారు. ఇక పండ్లు, కూరగాయాలతోపాటు పలు రకాల ధాన్యాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికమని వారు స్పష్టం చేస్తున్నారు.


ఇవి చర్మ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయిని వారు వివరిస్తున్నారు. అంతేకాదు.. చేపలు, పప్పు ధాన్యాల్లో వాపు గుణాన్ని నియంత్రించే గుణం అధికంగా ఉంటుందని చెబుతున్నారు. అదే విధంగా దురద, మొటిమలు వంటి చర్మ సంబంధమైన సమస్యలు తగ్గించేందుకు దోహదం చేస్తుందని పరిశోధకులు విపులీకరిస్తున్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 29 , 2024 | 11:58 AM