Picture Puzzle: మీ బ్రెయిన్‌కు సవాల్.. ఆ రెండు ఫొటోల్లోని 3 తేడాలను 20 సెకెన్లలో కనిపెట్టండి..!
ABN , Publish Date - Jul 22 , 2024 | 09:01 AM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ వృద్ధుడు పేపర్ పట్టుకుని ఇంటి నుంచి బయటకు వస్తున్నాడు. పక్కపక్కనే ఉన్న రెండు ఫొటోల్లోనూ అవే సీన్లు ఉన్నాయి. అయితే ఆ రెండు ఫొటోల్లోనూ 3 స్వల్ప తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏంటో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 20 సెకెన్ల లోపు ఆ మూడు తేడాలను కనిపెట్టాలి. అలా కనిపెడితే మీ బ్రెయిన్ చాలా షార్ప్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ మూడు తేడాలు ఏంటో మీకు తెలిసిపోతుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇదెక్కడి మాస్ స్టంట్‌రా బాబూ.. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి ఎలా ఎగిరిపోయాడో చూడండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..