Share News

Temples in India : భారతదేశంలో హిందువులు దర్శించుకునే 10 ప్రసిద్ధ దేవాలయాలు ఇవే ..!

ABN , Publish Date - Mar 11 , 2024 | 04:04 PM

భారత దేశం ఎన్నో పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధ దేవాలయాలకు నెలవు. ఆధ్యాత్మికంగా ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో ముఖ్యంగా కొన్నింటిని మాత్రమే చెప్పుకోవలసి వస్తే ఈ పది దేవాలయాలు ముందు ఉంటాయి. వాటిలో..

Temples in India : భారతదేశంలో హిందువులు దర్శించుకునే 10 ప్రసిద్ధ దేవాలయాలు ఇవే ..!
Temples in India

హిందూ మతం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతంగా నిర్వచించబడింది. ఇతర మతాల మాదిరిగా కాకుండా, హిందూ మతానికి స్థాపకులు లేరు, వివిధ పురాతన వ్రాతప్రతులు, పండితులు ఈ మతాన్ని సాంప్రదాయ జీవన విధానంగా వర్ణించారు, ఇది ప్రారంభం, ముగింపును గుర్తించలేని మతంగా పేరు పొందింది. భారత దేశం ఎన్నో పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధ దేవాలయాలకు నెలవు. ఆధ్యాత్మికంగా ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో ముఖ్యంగా కొన్నింటిని మాత్రమే చెప్పుకోవలసి వస్తే ఈ పది దేవాలయాలు ముందు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా..

వైష్ణో దేవి ఆలయం..

త్రికూట పర్వతాలలో ఉన్న ఇది హందూ దేవత వైష్ణో దేవికి చెందిన దేవాలయం.. ఇక్కడ అమ్మవారిని విశేషంగా భక్తులు దర్శించుకుంటారు.

తిరుపతి వెంకన్న స్వామి

తిరుపతి వెంకటేశ్వరుడికి అంకితమైన అత్యంత సంపన్న దేవాలయాలలో తిరుపతి ఒకటి. ఇది గొప్ప పుణ్యక్షేత్రంగా అలరారుతున్నది.


ఇవి కూడా చదవండి:

దంతాలను సహజంగా తెల్లగా చేసుకోవడం ఎలా..!

జుట్టు పెరగాలంటే ఈ సమస్యలు దాటేస్తే చాలు.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!

ఆలోచనను మార్చి పడేసే పాప్‌కార్న్ బ్రెయిన్ గురించి తెలుసా..!

గోల్డెన్ టంపుల్..

సిక్కు తీర్థయాత్రలో ముఖ్యంగా దర్శించుకునే గోల్డెన్ టెంపుల్ సిక్కు వారికి చెందిన పవిత్ర దేవాలయం. ఇది బంగారు పూతతో నిర్మించిన గుడి.

కాశీ విశ్వనాథ ఆలయం..

వారణాసిలోని ప్రసిద్ధ దేవాలయం కాశీ విశ్వనాథ ఆలయం. శివుడిని ఆరాధించే భక్తులు తప్పక దర్శించుకునే క్షేత్రం.

జగన్నాథ దేవాలయం..

విష్ణువు అవతారమైన జగన్నాథునికి అంకితమైన ఈ గుడి రథయాత్ర ఉత్సవానికి ఎందరో భక్తులు పలు ప్రాంతాలనుంచి తరలి వస్తారు. దేశంలోనే పెద్ద స్థాయిలో ఇక్కడ రథయాత్ర జరుగుతుంది.

సిద్ధి వినాయక దేవాలయం..

అడ్డంకులను తొలగించే గణేశుడికి అంకితమైన ఈ గుడి మినియన్ల మంది భక్తులు విచ్చేసే ప్రదేశం. గణపతిని ఇక్కడ విశేషంగా కొలస్తారు.

మీనాక్షి ఆలయం.

సుందరేశ్వర స్వామికి అంకితం అయిన మీనాక్షి టెంపుల్ చారిత్రాత్మక హిందూ దేవాలయంగా పేరు పొందింది.


ఇవి కూడా చదవండి: జలపెనోస్ పచ్చి మిర్చిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటే..!

కేదార్ నాథ్ ఆలయం

ఇది శివుడు కొలువైమ ఆలయం. ఆ దేవ దేవుడిని యాత్రికులు చాలా శ్రమతో వచ్చి దర్శించుకుంటారు.

సోమనాథ్ ఆలయం..

ఇది గొప్ప ఆధ్యాత్మిక ఆలయం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు దర్శించుకునే పుణ్య క్షేత్రం.

లోటస్ టెంపుల్..

అన్ని మతాల ప్రజలు ప్రార్థన చేయడానికి ధ్యానం చేసేందుకు వీలైన గొప్ప ఆలయం ఇది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Mar 11 , 2024 | 04:12 PM