Share News

Propose Day 2024: వాలెంటైన్స్ వీక్‌లోని రెండవ రోజు ప్రపోజ్ డే ఈ రోజున..!

ABN , Publish Date - Feb 08 , 2024 | 11:07 AM

రోజ్ డే నుంచి మొదలయ్యే ఈ సంబరాలు ప్రేమికులకు పండుగనే చెప్పాలి.

Propose Day 2024: వాలెంటైన్స్ వీక్‌లోని రెండవ రోజు ప్రపోజ్ డే ఈ రోజున..!
Love Letter

వాలెంటైన్స్ వీక్ అనేది ప్రేమను తెలిపేందుకు సమయం. ప్రేమ, ఆప్యాయత, ప్రశంసలు తెలియజేసే కాలం. సరిగ్గా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే వరకూ ఈ ప్రత్యేక రోజులను ప్రేమికులంతా సెలబ్రేట్ చేసుకుంటారు. రోజ్ డే నుంచి మొదలయ్యే ఈ సంబరాలు ప్రేమికులకు పండుగనే చెప్పాలి. ఈ ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇది ప్రతి ప్రేమికుల మదిలో ప్రేమను రగిలించే రోజు.. తమ భాగస్వామికి ప్రేమకు తెలిపే వేడుక.. ప్రత్యేకించి ఈ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకుంటారంటే..

ఇద్దరి మధ్యా ప్రేమ ఉన్నా, ఇద్దరూ ప్రేమలో ఉన్నారని తెలిసినా ఈ ప్రపోజ్ డే రోజున తమ ప్రేమను ఒకరితో ఒకరు తెలుపుకుంటారు. ప్రత్యేకంగా ఈరోజుకు ఉన్న చరిత్రను గురించి చెప్పుకోవాల్సి వస్తే..

ప్రపోజ్ డే 2024

వాలెంటైన్స్ వీక్ వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే జరుపుకుంటారు. ఇది రోజ్ డే తర్వాత వాలెంటైన్స్ వీక్‌లోని రెండవ రోజున వస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున తమకు ఇష్టమైన వ్యక్తుల పట్ల ప్రేమను తెలిపే రోజు ఇది. 1477లో, ఆస్ట్రియన్ ఆర్చ్‌డ్యూక్ మాక్సిమిలియన్ మేరీ ఆఫ్ బుర్గుండికి డైమండ్ రింగ్‌తో తన ప్రేయసికి ప్రపోజ్ చేసాడట. అతను ఈ రోజున ప్రపోజ్ చేయడంతో ప్రత్యేకంగా నిలిచాడు. 1816లో ప్రిన్సెస్ షార్లెట్ నిశ్చితార్థం గొప్ప చర్చనీయాంశంగా మారినప్పుడు కూడా ఆ సంఘటన ముఖ్యమైనదిగా మారింది. ఇలా ప్రపోజ్ డేకు చాలా సంఘటనలే ప్రేరణగా నిలిచాయి. ఈ సంఘటనలే వాలెంటైన్స్ వీక్, ప్రపోజ్ డే వేడుకకు కారణమయ్యాయి.

ప్రేమను అధికారికంగా తెలియచేయాలనుకునే జంటలకు ప్రపోజ్ డే ముఖ్యమైన రోజు. ప్రేమ, నిబద్ధత, జీవితకాలం కలిసి గడపాలనే కోరిక, ఒకరిపై ఒకరికి లోతైన భావాలను వ్యక్తీకరించడానికి ఇది ముఖ్యమైన రోజు. ఈ రోజున ప్రపోజ్ చేయడం అనేది సంబంధంలో కొత్త అధ్యాయం ప్రారంభానికి ప్రతీక. ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది.

బహుమతులు..

ప్రపోజ్ డే రోజున ఆలోచనాత్మకమైన ప్రేమను తెలిపేందుకు బహుమతులతో తెలియజేస్తారు. లాకెట్టు, బ్రాస్‌లెట్ లేదా ఉంగరం ఆభరణాలను బహుమతిగా ఇస్తుంటారు.


ప్రేమలేఖ..

మనసులోని భావాలను, ఉద్దేశాలను ప్రేమగా వ్యక్తపరిచే హృదయపూర్వక ప్రేమలేఖను కూడా ఇవ్వచ్చు.ఇది అక్షరాల రూపంలో ప్రేమను తెలిపేందుకు కలిగిన గొప్ప అవకాశం అలాగే ప్రేమను తెలిపేందుకు వేసే శాశ్వత ముద్ర కావచ్చు.

విహారయాత్ర..

ఇద్దరి మధ్య ఏకాంతాన్ని నింపేందుకు విహారయాత్రను ప్లాన్ చేయవచ్చు. ఈ బహుమతి ఇద్దరికీ మధ్య మరిచిపోలేని జ్ఞాపకాలను ఇస్తుంది.

రింగ్..

ప్రేమకు ప్రతీకగా భాగస్వామికి అందమైన ప్రపోజల్ రింగ్‌ని ఇవ్వచ్చు. ఇవన్నీ ప్రేమను హృదయపూర్వకంగా తెలియజేసేందుకు మార్గాలుగా నిలుస్తాయి. మరెందుకు ఆలస్యం మీ ప్రేమను ఈ ప్రత్యేకమైన రోజున తెలియజేయండి.

Updated Date - Feb 08 , 2024 | 11:21 AM