Share News

T20 Worldcup: ఆస్ట్రేలియాపై అఫ్గాన్ గెలుపు.. ఆసక్తికరంగా మారిన సెమీస్ రేస్..!

ABN , Publish Date - Jun 23 , 2024 | 02:07 PM

టీ20 ప్రపంచకప్‌లో పసికూన అఫ్గానిస్తాన్ మరో సంచలన విజయం నమోదు చేసింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన అఫ్గాన్ టీమ్ తాజాగా సూపర్-8లో ఏకంగా ఆస్ట్రేలియానే చిత్తు చేసింది. ఈ విజయంతో సెమీస్ రేస్‌ను అఫ్గాన్ ఆసక్తికరంగా మార్చింది. తమ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

T20 Worldcup: ఆస్ట్రేలియాపై అఫ్గాన్ గెలుపు.. ఆసక్తికరంగా మారిన సెమీస్ రేస్..!
Afghanistan team

టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup)లో పసికూన అఫ్గానిస్తాన్ (Afghanistan) మరో సంచలన విజయం నమోదు చేసింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్‌ను మట్టికరిపించిన అఫ్గాన్ టీమ్ తాజాగా సూపర్-8లో ఏకంగా ఆస్ట్రేలియానే చిత్తు చేసింది (Aus vs Afg). ఈ విజయంతో సెమీస్ రేస్‌ను అఫ్గాన్ ఆసక్తికరంగా మార్చింది (T20 Worldcup Semis). తమ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ నేపథ్యంలో సెమీస్ చేరే జట్లు ఏంటనే విషయంలో సూపర్ సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ జట్టుకు ఎలాంటి అవకాశాలున్నాయో చూద్దాం..


గ్రూప్‌-1లో రెండు విజయాలు సాధించిన టీమిండియా 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ ఒక్కో విజయం సాధించి సమంగా ఉన్నాయి. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన బంగ్లాదేశ్ సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో అఫ్గాన్‌పై ఆసీస్ గెలిచి ఉంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆస్ట్రేలియా, భారత్ సెమీస్ చేరేవి. అయితే అఫ్గాన్ గెలవడంతో సమీకరణాలు క్లిష్టంగా మారాయి. ప్రస్తుతం 2 పాయింట్లు, +0.223 నెట్‌రన్ రేట్‌తో ఉన్న ఆస్ట్రేలియా తర్వాతి మ్యాచ్‌లో టీమిండియాతో తలపడుతోంది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయి, బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో అఫ్గాన్ గెలిస్తే భారత్‌తో పాటు అఫ్గాన్ సెమీస్ చేరుతుంది.


ప్రస్తుతం ఇండియా చాలా సేఫ్ ప్లేస్‌లో ఉంది. 4 పాయింట్లు, +2.425 నెట్‌రన్ రేట్‌తో ఉంది. చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో అత్యంత భారీ తేడాతో ఓడితే తప్ప టీమిండియా సెమీస్ చేరుకోవడం ఖాయం. ఇక, 2 పాయింట్లు, -0.650 నెట్‌రన్ రేట్‌తో ఉన్న అఫ్గాన్ తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించాలి. టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోతే అఫ్గాన్ నేరుగా ఫైనల్ చేరుతోంది. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది.

ఇవి కూడా చదవండి..

T20 Worldcup: డేవిడ్ మిల్లర్ ఓవరాక్షన్.. మందలించిన అంపైర్లు.. అసలేం జరిగిందంటే..!


T20 Worldcup: ప్యాట్ కమిన్స్ అత్యంత అరుదైన రికార్డు.. ప్రపంచకప్‌లో వరుసగా రెండ్రో హ్యాట్రిక్!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 23 , 2024 | 02:07 PM