Share News

12 పరుగులకే ఆలౌట్‌

ABN , Publish Date - May 09 , 2024 | 05:01 AM

టీ20 క్రికెట్‌ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా పసికూన మంగోలియా చెత్త రికార్డును మూటగట్టుకొంది...

12 పరుగులకే ఆలౌట్‌

టీ20ల్లో మంగోలియా చెత్త రికార్డు

సనో (జపాన్‌): టీ20 క్రికెట్‌ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా పసికూన మంగోలియా చెత్త రికార్డును మూటగట్టుకొంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా.. మంగోలియా 8.2 ఓవర్లలో 12 పరుగులకే కుప్పకూలింది. టుర్‌ సుమాయా (11 బంతుల్లో 4) టాప్‌ స్కోరర్‌. గతేడాది ఫిబ్రవరిలో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులకే ఆలౌటైన ఐజల్‌ ఆఫ్‌ మెన్స్‌ జట్టు టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.

Updated Date - May 09 , 2024 | 05:01 AM