Share News

Paris Olympics:రెజ్లింగ్‌లో పతకంపై ఆశలు.. సెమీస్‌‌కు చేరిన అమన్ సెహ్రావత్..

ABN , Publish Date - Aug 08 , 2024 | 05:12 PM

రెజ్లింగ్‌లో భారత్ పతకం ఆశలు గల్లంతయ్యాయని భావిస్తున్న సమయంలో మరో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పతకం ఆశలు సజీవంగా ఉంచాడు. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆల్బానియా క్రీడాకారుడు జెలిమ్ఖాన్ అబాకరోవ్‌పై 12-0తో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు ప్రవేశించాడు.

Paris Olympics:రెజ్లింగ్‌లో పతకంపై ఆశలు.. సెమీస్‌‌కు చేరిన అమన్ సెహ్రావత్..
Aman Sehrawat

రెజ్లింగ్‌లో భారత్ పతకం ఆశలు గల్లంతయ్యాయని భావిస్తున్న సమయంలో మరో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పతకం ఆశలు సజీవంగా ఉంచాడు. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆల్బానియా క్రీడాకారుడు జెలిమ్ఖాన్ అబాకరోవ్‌పై 12-0తో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు ప్రవేశించాడు. గురువారం రాత్రి 9.45గంటలకు జరిగే సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన రేయి హిగుచితో తలపడతాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌కు రెజ్లింగ్‌లో పతకం ఖాయమవుతుంది. సెమీస్‌లో ఓడినా కాంస్య పతకం కోసం జరిగే పోరులో తలపడాల్సి వస్తుంది. హర్యానకు చెందిన అమన్ సెహ్రావత్ 2023 కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. 2022 ఆసియా క్రీడల్లో 57 కిలోల పురుషుల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరి రెజ్లింగ్‌లో భారత్‌కు పతకంపై ఆశలు సజీవంగా ఉంచాడు.

Vinesh Phogat: వినేశ్‌ ఫొగట్‌‌పై కుట్ర జరిగిందా?


రెండింటిలో అధిప్యతం..

అమన్ సెహ్రావత్ ప్రీకార్వర్ట్స్‌లో నార్త్ మాసిడోనియాకు చెందిన వ్లాదిమిర్ ఎగోరోవ్‌పై 10-0 తేడాతో విజయం సాధించాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో సైతం ఆల్బానియా క్రీడాకారుడు జెలిమ్ఖాన్ అబాకరోవ్‌పై 12-0తో పూర్తి అధిప్యతాన్ని ప్రదర్శించాడు. అమన్ తన రెండు మ్యాచుల్లో ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనీయలేదు. దీంతో సునాయసంగా వరుస రెండింటిలో గెలిచి సెమీస్‌కు చేరాడు.

ఆశలన్నీ చోప్రాపైనే!


రెజ్లింగ్ చుట్టూ వివాదం..

రెజ్లింగ్‌లో భారత క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు బరువు ఎక్కువుగా ఉండటంతో వినేష్ ఫోగట్ ఫైనల్ మ్యాచ్‌కు దూరం కాగా.. మరో రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈక్రమంలో అమన్ సెహ్రావత్ రెజ్లింగ్‌లో పతకంపై ఆశలు మిగిల్చాడు. వాస్తవానికి వినేష్ ఫోగట్ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు పతకాన్ని ఖాయం చేసింది. దీంతో స్వర్ణం లేదా కనీసం రజత పకతమైనా వస్తుందని 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూశారు. చివరికి బరువు అధికంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. ప్రస్తుతం రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో అమన్ పతకంపై ఆశలు చిగురించాడు. వెయిట్ లిస్టింగ్‌లో : మీరాబాయి చాను పతకం తెస్తారని ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆమె 4వ స్థానంలో నిలిచింది. దీంతో పతకం తృటిలో తప్పింది. మొదట 3వ స్థానంలో నిలవగా థాయిలాండ్ క్రీడాకారిణి చాను పతకం ఆశలపై నీళ్లు చల్లింది. తన మూడో ప్రయత్నంలో థాయిలాండ్ క్రీడాకారిణి కాంబో మొటి, రెండో రౌండ్ కలిపి 200 కేజీల బరువును విజయవంతంగా పూర్తి చేయడంతో 199 కేజీలతో చాను 4వ స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.


Vinesh Phogat : వినేశ్‌ విలాపం

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 08 , 2024 | 09:08 PM