Share News

ఊరించి.. ఉసూరుమనిపించి

ABN , Publish Date - Aug 03 , 2024 | 06:13 AM

ఆర్చరీ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో తొలిసారి సెమీస్‌కు చేరిన భారత జోడీగా ధీరజ్‌-అంకిత భకత్‌ రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా పతకంపైనా ఆశలు రేపినా సఫలం కాలేకపోయారు. శుక్రవారం మొదట క్వార్టర్స్‌లో భారత జోడీ

ఊరించి.. ఉసూరుమనిపించి

ఆర్చరీ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో తొలిసారి సెమీస్‌కు చేరిన భారత జోడీగా ధీరజ్‌-అంకిత భకత్‌ రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా పతకంపైనా ఆశలు రేపినా సఫలం కాలేకపోయారు. శుక్రవారం మొదట క్వార్టర్స్‌లో భారత జోడీ 5-3 తేడాతో కనాలెస్‌-గొంజాలెజ్‌ (స్పెయిన్‌)ను ఓడించి సెమీ్‌సలో అడుగుపెట్టింది. సెమీస్‌లో కొరియాను ఎదుర్కొన్న భారత ఆర్చర్లు ప్రభావం చూపలేక 2-6తో ఓటమిపాలై కాంస్య పతక పోరుకు సిద్ధమయ్యారు. ఇందులో యూఎ్‌సఏకు చెందిన బ్రాడీ ఎలిసన్‌-క్యాసీ కాఫ్‌హోల్డ్‌ పూర్తి ఆధిపత్యం చూపారు. తొలి రెండు సెట్లను అంకిత 7తో ఆరంభించడం దెబ్బతీసింది. తెలుగు కుర్రాడు ధీరజ్‌ మాత్రం 10 పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలో ఉంచేందుకు ప్రయత్నించాడు. అటు బ్రాడీ స్టన్నింగ్‌ షాట్లతో రెండో సెట్‌ను 4-0తో ముగించాడు. అయితే కీలక మూడో సెట్‌లో అంకిత 10తో ఆరంభించగా నాలుగు బాణాలు కూడా యెల్లో జోన్‌లోనే దిగాయి. దీంతో భారత్‌ 2-4తో పోటీలో నిలిచింది. కానీ నాలుగో సెట్‌ను అంకిత 8తో ఆరంభించగా, అటు యూఎస్‌ 10తో ముందుకెళ్లడంతో భారత్‌ కోలుకోలేకపోయింది. చివరకు 2-6తో ఓడి ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.

Updated Date - Aug 03 , 2024 | 06:13 AM