Share News

క్రీడలకు భారీ బడ్జెట్‌

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:55 AM

స్వతహాగా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడైన సీఎం రేవంత్‌ రెడ్డి స్పోర్ట్స్‌పై తనకున్న ప్రేమ, శ్రద్ధను బడ్జెట్‌లో ప్రస్ఫుటం చేశారు. గురువారం ప్రవేశపెట్టిన 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ. 389.87 కోట్లు కేటాయించారు...

క్రీడలకు భారీ బడ్జెట్‌

  • రూ.389.87 కోట్ల కేటాయింపు

  • నగదు ప్రోత్సాహకాలకు 100 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): స్వతహాగా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడైన సీఎం రేవంత్‌ రెడ్డి స్పోర్ట్స్‌పై తనకున్న ప్రేమ, శ్రద్ధను బడ్జెట్‌లో ప్రస్ఫుటం చేశారు. గురువారం ప్రవేశపెట్టిన 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ. 389.87 కోట్లు కేటాయించారు. వీటిలో రూ.325.05 కోట్లు స్టేడియాల ఆధునికీకరణ, నిర్వహణ, జిల్లా క్రీడా ప్రాథికార సంస్థలు, రాష్ట్ర క్రీడా సంఘాల గ్రాంట్స్‌కు వెచ్చించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో క్రీడాకారులు పాల్గొనేందుకు, పతకాలు సాధించిన అథ్లెట్లకు నగదు ప్రోత్సాహకాలు అందించేందుకు, ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు రూ.100 కోట్లు కేటాయించారు. ఇక, గతేడాది బడ్జెట్‌లో క్రీడలకు తొలుత 126.06 కోట్లు కేటాయించగా, ఆ తర్వాత తెలంగాణ క్రీడా ప్రాంగణాల కోసం మరో రూ.85 కోట్లు అదనంగా ఇచ్చారు.

Updated Date - Jul 26 , 2024 | 03:55 AM