Share News

మెరిసిన ధీరజ్‌, అంకిత

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:54 AM

తెలుగు ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర, అంకిత భకత్‌ గురి కుదరడంతో.. ఒలింపిక్స్‌ను భారత్‌ ఆశావహంగా ఆరంభించింది. ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందే.. గురువారం జరిగిన ర్యాంకింగ్‌ రౌండ్లలో అదరగొట్టిన భారత...

మెరిసిన ధీరజ్‌, అంకిత

  • క్వార్టర్స్‌లో రికర్వ్‌ ఆర్చరీ జట్లు

పారిస్‌: తెలుగు ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర, అంకిత భకత్‌ గురి కుదరడంతో.. ఒలింపిక్స్‌ను భారత్‌ ఆశావహంగా ఆరంభించింది. ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందే.. గురువారం జరిగిన ర్యాంకింగ్‌ రౌండ్లలో అదరగొట్టిన భారత పురుషులు, మహిళల జట్లు నేరుగా క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. ధీరజ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ రమేష్‌ జాదవ్‌లతో కూడిన పురుషుల జట్టు మొత్తం 2013 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. క్వార్టర్స్‌లో టర్కీ లేదా కొలంబియాతో తలపడే అవకాశం ఉంది. కొరియా (2049), ఫ్రాన్స్‌ (2025)లు తొలి రెండుస్థానాలు దక్కించుకొన్నాయి. వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో ధీరజ్‌ 681 పాయింట్లతో నాలుగోస్థానంలో, తరుణ్‌దీప్‌ 674 పాయింట్లతో 14వ స్థానంలో, ప్రవీణ్‌ 658 పాయింట్లతో 39వ స్థానంలో నిలిచారు. కాగా, అంకిత భకత్‌, దీపిక కుమారి, భజన్‌ కౌర్‌లతో కూడిన మహిళల జట్టు 1983 పాయుంట్లతో నాలుగో స్థానంలో నిలిచి రౌండ్‌-8 చేరుకొంది. క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌ లేదా ఫ్రాన్స్‌తో భారత్‌ తలపడనుంది. కాగా, వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌లో అంకిత 11, కౌర్‌ 22, దీపిక 23వ స్థానాల్లో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించారు. మిక్స్‌డ్‌ కేటగిరీలో ధీరజ్‌-అంకిత జోడీ 5వస్థానంలో నిలిచింది.

Updated Date - Jul 26 , 2024 | 03:54 AM