Share News

IPL: అలాంటి ఆటగాళ్లపై నిషేధం విధించాలి.. బీసీసీఐ ముందు ఫ్రాంఛైజీల షాకింగ్ డిమాండ్!

ABN , Publish Date - Jul 31 , 2024 | 08:21 PM

అటు ఆటగాళ్లకు, ఇటు ఫ్రాంఛైజీలకు మరోవైపు బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ (IPL). ప్రతి ఏడాది నిర్వహించే వేలంలో ఫ్రాంఛైజీ యజమానులు కోట్లు పెట్టి ఆటగాళ్లను కొంటూ ఉంటారు. వారి ఫామ్‌ను బట్టి, వారికున్న డిమాండ్‌ను బట్టి కోట్లు గుమ్మరిస్తారు.

IPL: అలాంటి ఆటగాళ్లపై నిషేధం విధించాలి.. బీసీసీఐ ముందు ఫ్రాంఛైజీల షాకింగ్ డిమాండ్!
IPL

అటు ఆటగాళ్లకు, ఇటు ఫ్రాంఛైజీలకు మరోవైపు బీసీసీఐ (BCCI)కి కాసుల వర్షం కురిపించే క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ (IPL). ప్రతి ఏడాది నిర్వహించే వేలంలో ఫ్రాంఛైజీ యజమానులు కోట్లు పెట్టి ఆటగాళ్లను కొంటూ ఉంటారు. వారి ఫామ్‌ను బట్టి, వారికున్న డిమాండ్‌ను బట్టి కోట్లు గుమ్మరిస్తారు. అయితే కొందరు విదేశీ ఆటగాళ్ల (Foreign players ) కారణంగా ఫ్రాంఛైజీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. తాజాగా బీసీసీఐ సీఈవో హేమంగ్ అమిన్‌తో జరిగిన సమావేశంలో ఫ్రాంఛైజీ యజమానులు షాకింగ్ డిమాండ్ చేశారట.


తాము వేలంలో దక్కించుకున్న కొందరు విదేశీ ఆటగాళ్లు వ్యక్తిగత కారణాల సాకు చెప్పి లీగ్ సమయానికి అందుబాటులో ఉండడం లేదని ఫ్రాంఛైజీ యజమానులు తెలిపారట. దాంతో జట్టు కూర్పు విషయంలో తాము వేసుకున్న ప్రణాళికలు అన్నీ తల్లకిందులవుతున్నాయని వాపోయారట. వేలంలో తాము ఆశించిన ధర దక్కకపోతే, విదేశీ ఆటగాళ్లు లీగ్‌కు అందుబాటులో ఉండడం లేదని చెప్పారట. అలాంటి ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి పూర్తిగా బహిష్కరించాలని బీసీసీఐని ఫ్రాంఛైజీ యజమానులు కోరినట్టు వార్తలు వస్తున్నాయి.


తమ ఫ్రాంఛైజీ తరఫున ఆడాల్సిన విదేశీ ఆటగాడు ఏదో సాకు చెప్పి దూరమవుతుండడంతో అప్పటికప్పుడు మరో విదేశీ ఆటగాడిని వెతకడం కష్టమవుతోందని చెప్పారట. మరి, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం భారీ వేలం జరగబోతోంది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంఛైజీల యజమానులు బీసీసీఐ అధికారులతో సమావేశమయ్యారు. ఆటగాళ్లు రిటెన్షన్, ఇంపాక్ట్ ప్లేయర్, సాలరీ క్యాప్స్ తదితర విషయాల గురించి చర్చలు జరిగినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి..

Paris Olympics 2024: బాక్సింగ్ మ్యాచ్‌లో లవ్లీనా విజయం.. పతకానికి మరో అడుగు దూరంలో..


Virat Kohli: కోహ్లీకి ఘోర అవమానం.. ప్రాక్టీస్ చేస్తుండగా అలా గేలి చేయడంతో సీరియస్.. వీడియో వైరల్!


ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీని బీట్ చేసిన జైస్వాల్.. ఇక రోహిత్ శర్మ..


Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న లక్ష్యసేన్..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 31 , 2024 | 08:21 PM