Share News

సుమిత్‌, మరియప్పన్‌కు స్వర్ణాలు

ABN , Publish Date - May 22 , 2024 | 01:41 AM

వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ సుమిత్‌ అంటిల్‌ టైటిల్‌ను నిలబెట్టుకోగా.. తంగవేలు మరియప్పన్‌, ఏక్తా భయన్‌ స్వర్ణాలు సాధించారు..

సుమిత్‌, మరియప్పన్‌కు స్వర్ణాలు

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌

కోబ్‌ (జపాన్‌): వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ సుమిత్‌ అంటిల్‌ టైటిల్‌ను నిలబెట్టుకోగా.. తంగవేలు మరియప్పన్‌, ఏక్తా భయన్‌ స్వర్ణాలు సాధించారు. పురుషుల ఎఫ్‌-64 జావెలిన్‌ త్రోలో సుమిత్‌ 69.50 మీటర్లు విసిరి పసిడి సాధించాడు. 2023 ఈవెంట్‌లో కూడా అంటిల్‌ స్వర్ణం నెగ్గాడు. అతడి సహచరుడు సందీప్‌ 60.41 మీ. విసిరి కాంస్యం దక్కించుకొన్నాడు. టి-63 హైజం్‌పలో మరియప్పన్‌ 1.88 మీ. దూకి విజేతగా నిలిచాడు. మహిళల ఎఫ్‌-51 క్లబ్‌ త్రోలో ఎక్తా 20.12 మీటర్లు విసిరి పసిడి పట్టేయగా.. కషిష్‌ లక్రా 14.56 మీ. విసిరి రజతం సాధించింది.


భారత రిలే జట్లకు రజతాలు

బ్యాంకాక్‌: ఆసియా రిలే అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో భారత పురుషులు, మహిళల జట్లు 4్ఠ 400 మీటర్ల రిలే విభాగాల్లో రజత పతకాలు సాధించారు. మహిళల బృందం 3 నిమిషాల 33.55 సెకన్ల టైమింగ్‌తో రెండోస్థానంలో నిలిచింది. పురుషుల జట్టు 3 నిమిషాల 05.76 సెకన్లతో ద్వితీయస్థానంతో రేసు ముగించింది.

Updated Date - May 22 , 2024 | 01:41 AM