Share News

Pakistan: కోహ్లీ పాకిస్తాన్ వస్తే.. భారత్‌ను మర్చిపోతాడు.. పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రీది ఆసక్తికర వ్యాఖ్యలు!

ABN , Publish Date - Jul 12 , 2024 | 11:57 AM

వచ్చే ఏడాది జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ ఐసీసీ టోర్నీని పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. ఈ టోర్నీ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇప్పటికే ఐసీసీకి సమర్పించింది. అయితే పాకిస్తాన్ వెళ్లి ఆడేందుకు టీమిండియా విముఖత చూపుతోంది.

Pakistan: కోహ్లీ పాకిస్తాన్ వస్తే.. భారత్‌ను మర్చిపోతాడు.. పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రీది ఆసక్తికర వ్యాఖ్యలు!
Shahid Afridi, Virat Kohli

వచ్చే ఏడాది జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) విషయంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ ఐసీసీ టోర్నీని పాకిస్తాన్ (Pakistan) నిర్వహించాల్సి ఉంది. ఈ టోర్నీ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇప్పటికే ఐసీసీ (ICC)కి సమర్పించింది. అయితే పాకిస్తాన్ వెళ్లి ఆడేందుకు టీమిండియా విముఖత చూపుతోంది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లను భారత్‌లోనే నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ (BCCI) కోరబోతున్నట్టు సమాచారం.


పాకిస్తాన్‌లో ఆడేందుకు బీసీసీఐ విముఖత చూపుతున్న నేపథ్యంలో ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రీది (Shahid Afridi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పక్కనపెట్టి టీమిండియా ఒక్కసారి పాకిస్థాన్‌లో పర్యటించాలని అఫ్రిదీ కోరాడు. ముఖ్యంగా కోహ్లీకి (Virat Kohli) పాకిస్తాన్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని పేర్కొన్నాడు. ``ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత ఆటగాళ్లు పాకిస్తాన్‌కు రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా కోహ్లీకి ఇక్కడ భారీ క్రేజ్ ఉంది. కోహ్లీ పాకిస్తాన్ వస్తే.. ఇక్కడి వారి ప్రేమను చూసి భారత్‌లోని అభిమానులను మర్చిపోతాడు. నేను కూడా కోహ్లీకి అభిమానినే`` అని ఆఫ్రీది అన్నాడు.


``మేం గతంలో భారత్‌లో పర్యటించినపుడు మాపై అక్కడి ప్రజలు అపారమైన ప్రేమ, అభిమానం చూపించారు. 2005లో భారత్ ఇక్కడకు వచ్చినపుడు కూడా అదే జరిగింది. భారత్-పాకిస్థాన్ దేశాల్లో క్రికెట్‌ను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. ఈ రెండు దేశాలు క్రికెట్‌లో తలపడడాన్ని మించింది మరొకటి లేదు`` అంటూ ఆఫ్రీది వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి..

ఆఖరి నిమిషంలో వాట్కిన్స్‌ వండర్‌ గోల్‌


జాతీయ పతాకాన్ని అగౌరపరిచాడట!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 12 , 2024 | 11:57 AM