Share News

IPL 2024 Final: కోల్‌కతా ఘనవిజయం.. ఏకపక్షంగా సాగిన ఐపీఎల్ ఫైనల్..!

ABN , Publish Date - May 26 , 2024 | 10:25 PM

ఐపీఎల్-2024 సీజన్ ముగిసింది. ఎంతో రసవత్తరంగా సాగిన సీజన్ ఫైనల్ మాత్రం అత్యంత ఏకపక్షంగా సాగింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన కోల్‌కతా సునాయాసంగా విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది.

IPL 2024 Final: కోల్‌కతా ఘనవిజయం.. ఏకపక్షంగా సాగిన ఐపీఎల్ ఫైనల్..!
IPL 2024 Final

ఐపీఎల్-2024 సీజన్ ముగిసింది. ఎంతో రసవత్తరంగా సాగిన సీజన్ ఫైనల్ మాత్రం అత్యంత ఏకపక్షంగా సాగింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన కోల్‌కతా సునాయాసంగా విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో ఏ దశలోనూ హైదరాబాద్ టీమ్ పై చేయి సాధించలేదు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది.

KKR Vs SRH: ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌ను ఒక్క క్లిక్‌తో చూసేయండి..!


హైదరాబాద్ బ్యాటర్లు అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0) మొదట్లోనే అవుట్ కావడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ తడబడుతూ మొదలైంది. ఆ తర్వాత బరిలోకి దిగిన రాహుల్ త్రిపాఠి (9), నితీష్ రెడ్డి (13), ఆదెల్ మార్‌‌క్రమ్ (20), షాబాజ్ అహ్మద్ (8), అబ్దుల్ సమద్ (4) వరుసగా వెనుదిరిగారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 24 పరుగులతో టాప్ స్కోరర్‌‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 3, స్టార్క్ 2, హర్షిత్ 2, అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు.


114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా సునాయాసంగా ఛేదించింది. నరైన్ (6) త్వరగానే ఔటైనా మరో ఓపెనర్ గుర్భాజ్ (31 బంతుల్లో 39) రాణించాడు. వేగంగా ఆడిన వెంకటేష్ అయ్యర్ (26 బంతుల్లో 52) చివరి వరకు క్రీజులో నిలిచాడు. మరో బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ (6 నాటౌట్)తో కలిసి కోల్‌కతాను విజయ తీరాలకు చేర్చాడు. దీంతో కోల్‌కతా 2 వికెట్లు కోల్పోయి 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టైటిల్ సాధించింది.

Updated Date - May 26 , 2024 | 10:42 PM