IPL: కేకేఆర్ మెంటార్ అతడేనా? గంభీర్ స్థానంలో మాజీ స్టార్ ఆల్ రౌండర్‌కు ఛాన్స్..?
ABN , Publish Date - Sep 09 , 2024 | 11:47 AM
వచ్చే ఏడాది జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ మెంటార్ వేటలో పడింది. ఈ ఏడాది జరిగిన సీజన్‌లో కేకేఆర్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్‌గా వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది.
వచ్చే ఏడాది జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) టీమ్ మెంటార్ (KKR mentor) వేటలో పడింది. ఈ ఏడాది జరిగిన సీజన్‌లో కేకేఆర్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) టీమిండియాకు హెడ్ కోచ్‌గా వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో గంభీర్ స్థానంలో కొత్త మెంటార్ ఎంపిక కోల్‌కతాకు అనివార్యమైంది. 18వ సీజన్ మొదలయ్యే లోపే ఆ పని పూర్తి చేయాలని యాజమాన్యం పట్టుదలతో ఉంది. కేకేఆర్ మెంటార్ రేసులో పలువురు దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు.
కేకేఆర్ మెంటార్, కోచ్‌లను నియమించేందుకు సిద్ధమవుతోంది. కేకేఆర్ మెంటార్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కల్లీస్ (Jacques Kallis) పేరు వినబడుతోంది. ఈ లెజెండరీ ఆల్‌రౌండర్ గతంలో కోల్‌కతాకు ఆడాడు. ఆ తర్వాత కేకేఆర్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. జట్టుతో అనుబంధం ఉన్న కల్లిస్‌ను మెంటార్‌గా తీసుకోవాలని కోల్‌కతా అనుకుంటోంది. ఇప్పటికే కల్లిస్‌ను కేకేఆర్ మేనేజ్‌మెంట్ సంప్రదించినట్టు సమాచారం. కల్లీస్ కూడా ఆ బాధ్యత నిర్వర్తించేందుకు సముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
ఇక, జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ (Ricky Ponting)ను తీసుకోవాలని కేకేఆర్ భావిస్తోందట. పాంటింగ్ తాజా సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. అయితే ఈమధ్యే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ పాంటింగ్‌ను కోచ్ పదవి నుంచి తొలగించింది. అయినా సరే పాంటింగ్ నిరాశపడకుండా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఎవరైనా తనను సంప్రదిస్తే కోచ్‌గా ఉండేందుకు సిద్ధమని ప్రకటించాడు. పాంటింగ్ అనుభవం తమ జట్టుకు ఉపయోగపడుతుందని కేకేఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Moeen Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు మొయిన్ అలీ గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..